అమెరికాలో 'ద్వారక' పాటలు విడుదల

  • IndiaGlitz, [Sunday,September 11 2016]

సూపర్‌గుడ్‌ ఫిలింస్‌(ఆర్‌.బి.చౌదరి) సమర్పణలో లెజెండ్‌ సినిమా బ్యానర్‌పై శ్రీనివాస్‌ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్‌ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక'. ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్‌ను రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాట‌ల‌ను సెప్టెంబ‌ర్ 10న తెలుగు అసోసియేష‌న్ ఆఫ్ నార్త్ అమెరికా, ట్రై స్టేట్ తెలుగు అసోసియేష‌న్ అధ్వ‌ర్యంలో గ్రాండ్ లెవ‌ల్లో నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ముఖ హీరో నారా రోహిత్ విశిష్ట అతిథిగా అతిథిగా హాజ‌ర‌య్యారు.

పెళ్ళిచూపుల‌తో సెన్సేష‌న‌ల్ హిట్ కొట్టి, ఇప్పుడు ద్వారక చిత్రంలో హీరోగా న‌టిస్తున్న హీరో విజ‌య్ దేవ‌ర కొండ‌, హీరోయిన్ పూజా జ‌వేరితో పాటు చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీనివాస్ ర‌వీంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ వేడుక‌లో పాడుతాతీయ‌గా గాయ‌కుల‌తో క‌లిసి మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్ లైవ్ పెర్‌ఫార్మ‌న్స్ చేశారు. ఈ కార్య‌క్రమానికి అక్క‌డి తెలుగు వారి నుండి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. తానా అధ్య‌క్ష్యుడు జంపాల చౌద‌రి, ఉమెన్ స‌ర్వీస్ కో ఆర్డినేట‌ర్ ర‌జ‌నీ, ట్రై తెలుగు అసోసియేష‌న్ యుగంధ‌ర్ ఏడ్ల‌పాటి, జ‌గ‌దీష్ కానూరుతో పాటు తెలుగు క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ క‌న్వీన‌ర్ ప‌ద్మ‌శ్రీ ముత్యాల త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు.

అమెరికాలో విడుద‌లైన సాంగ్స్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లో హైద‌రాబాద్‌లో ద్వార‌క ఆడియో విడుద‌ల కార్య్ర‌క‌మాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

More News

మోహన్ బాబు 40 నట వసంతాల వేడుకలో విశేషాలు...

సాధారణ వ్యక్తిగా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతి శిఖరాలను అధిరోహించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అభిమాన నటుడయ్యారు.

'ఓం నమోవేంకటేశాయ' ఓవర్ సీస్ రైట్స్ ఎంతంటే....

అక్కినేని నాగార్జున టైటిల్ ప్రాతలో కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్ టైన్మెంట్ ప్రై.లి బ్యానర్ పై

విష్ణు మంచు 'లక్కున్నోడు' ప్రారంభం

'ఈడోరకం-ఆడోరకం' వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత విష్ణు మంచు హీరోగా,బబ్లీ బ్యూటీ హన్సిక హీరోయిన్ గా ఎం.వి.వి.సినిమా బ్యానర్ పై గీతాంజలి,త్రిపుర వంటి హర్రర్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించిన దర్శకుడు రాజ్ కిరణ్

స్టైలిష్ పోలీస్ గా మహేష్...

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

'హైపర్‌' షూటింగ్ పూర్తి

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).