ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌కు ఈసీ అనుమ‌తి

  • IndiaGlitz, [Monday,March 25 2019]

దివంగ‌త నేత ఎన్టీఆర్ జీవితంలో ఓ ఘ‌ట్టంతో తెర‌కెక్కిన చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'. లక్ష్మీ పార్వ‌తి ఎన్టీఆర్ జీవితంలో ప్ర‌వేశించిన ద‌గ్గ‌రి నుండి ఆయ‌న త‌న ముఖ్య‌మంత్రిని ఎలా కోల్పోయారు. చివ‌ర‌కు ఎలా ప్రాణాలు విడిచారు. ఆయ‌న మాన‌సిక వేద‌న‌లో ఆయ‌న కుటుంబ స‌భ్యుల పాత్ర ఎంత వ‌ర‌కు ఉంది? ఇలాంటి అంశాల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ఎన్నిక‌ల స‌మ‌యంలో విడుద‌లైతే తెలుగుదేశం పార్టీపై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉందని కొంద‌రు నేత‌లు ఎన్నిక‌ల క‌మీష‌న్‌కు పిర్యాదు చేశారు.

పిర్యాదును ప‌రిశీలించిన ఎన్నిక‌ల క‌మీష‌న్‌.. చి త్ర నిర్మాత రాకేష్ రెడ్డిని మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) ముందు హాజరు కావాలని కోరింది. ఈసీ ఆదేశించిన‌ట్లుగా చిత్ర నిర్మాత రాకేష్ రెడ్డి క‌మిటీ ముందుకు సోమవానం హాజర‌య్యారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సినిమాకు సంబంధించి ఈసీ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మేం స‌మాధానం చెప్పాం. వారు మా ప్ర‌శ్న‌ల‌తో సంతృప్తిగా ఉన్నార‌ని అనిపించింది. సినిమా విడుద‌ల‌కు అంగీక‌రించారు. విడుద‌ల త‌ర్వాత ఏమైనా అభ్యంత‌రాలుంటే మ‌ళ్లీ హాజ‌రు కావాల‌ని కూడా సూచించారు. ఈ సినిమాను ల‌క్ష్మీ పార్వ‌తిగారు రాసిన పుస్త‌కం ఆధారంగానే తీశాంఅన్నారు.

More News

త‌ప్పు ఒప్పుకొన్న రాధార‌వి

ప్ర‌ముఖ న‌టి న‌య‌న‌తార ప‌ట్ల రాధార‌వి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌కు ఒక్క‌సారిగా కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ కూడా ఉలిక్కిప‌డింది. మ‌హిళ‌ల ప‌ట్ల వేదిక‌ల మీద అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌టం త‌ప్పు అని ఖండించింది.

అ,ఆలు కూడా రాని లోకేశ్‌‌కు అగ్రతాంబూలమా!? 

ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్‌పై వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన షర్మిల లోకేశ్‌ గురించి మాట్లాడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోయిన్‌గా...

హీరోగా ఎంట్రీ ఇచ్చిన త‌క్కువ కాలంలోనే స్టార్ హీరో రేంజ్‌కు చేరుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ప్రొడ‌క్ష‌న్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.. కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌ను స్టార్ట్ చేశాడు.

ఐశ్వ‌ర్య గ‌ర్భ‌వ‌తి కాదు!

అందాల రాశి ఐశ్వ‌ర్య గ‌ర్భం దాల్చారా?  ఆమె మ‌రో సారి త‌ల్లి కాబోతున్నారా? అవున‌ని ఫొటోలు చెబుతుంటే, కాద‌ని ఆమె మీడియా టీమ్ చెబుతోంది.

వైసీపీ రూపంలో కేసీఆర్.. టీడీపీకి భయం

వైసీపీ రూపంలో కేసీఆర్ ఉన్నారని.. వైసీపీని చూస్తే టీడీపీకి భయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.