close
Choose your channels

Ee Nagaraniki Emaindi Review

Review by IndiaGlitz [ Friday, June 29, 2018 • తెలుగు ]

Ee Nagaraniki Emaindi Movie Review

ఆద్యంతం కొత్త‌వారితో తెర‌కెక్కించి తొలి సినిమా హిట్ కొట్ట‌డం ఇప్పుడున్న ట్రెండ్‌లో ఆషామాషీ కాదు. అలాంటిది ఆ సినిమాకి నేష‌న‌ల్ లెవ‌ల్లో రెండు అవార్డుల‌ను సంపాదించ‌డం కూడా మామూలు అంశం కాదు. అంత‌కు ముందు కేవ‌లం షార్ట్ ఫిల్మ్స్ ఎన్విరాన్‌మెంట్ మాత్ర‌మే తెలిసి, ఎక్క‌డా అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా కూడా ప‌నిచేయ‌కుండా తొలి సినిమాతోనే అంత గుర్తింపు సాధించిన‌ప్పుడు ఆత్మ‌విశ్వాసం అమాంతం పెరుగుతుంది. కొన్ని సార్లు అది అంచ‌నాలు త‌ప్పి, త‌ప్ప‌ట‌డుగుల ద‌శ‌గా దారిచూపుతుంది. అలా అడుగు వేయ‌కుండా స‌రైన అడుగు వేసిన‌ప్పుడు ఆ వ్య‌క్తిలో నిల‌క‌డ ఉన్న‌ట్టు.. పొగ‌డ్త‌ల‌కు పొంగిపోన‌ట్టు.. ఇప్పుడు మ‌నం మాట్లాడుకుంటున్న వ్య‌క్తి పేరు త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం. ఆయ‌న తీసిన తొలి సినిమా `పెళ్లి చూపులు`. శుక్ర‌వారం విడుద‌లైన రెండో సినిమా `ఈ న‌గ‌రానికి ఏమైంది?`. తొలి సినిమా ఇచ్చిన హిట్ కిక్‌తో రెండో సినిమాకు స్టార్ల వెనుక ప‌రుగులు తీయ‌కుండా, త‌న ప‌ద్ధ‌తిలోనే సినిమా చేశారు త‌రుణ్ భాస్క‌ర్ దాస్యం. ఈ సినిమా ఆయ‌నలో ఆత్మ‌విశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందా? ఆల‌స్య‌మెందుకు చ‌దివేయండి.

క‌థ‌:

వివేక్‌, కార్తిక్‌, కౌశిక్‌, ఉపేంద్ర స్నేహితులు. చిన్న‌ప్ప‌టి నుంచి హైద‌రాబాద్‌లోని మారేడ్‌ప‌ల్లిలో క‌లిసి పెరిగిన స్నేహితులు. వారంద‌రు క‌లిసి షార్ట్ ఫిల్మ్ తీయాల‌నుకుంటారు. అయితే వివేక్ భ‌య‌స్తుడు. అత‌నే షార్ట్ ఫిల్మ్స్ కి డైర‌క్ట‌ర్‌. త‌న షార్ట్ ఫిల్మ్ లో న‌టించిన అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు. అత‌ని మెంటాలిటీ త‌న‌కు సెట్ కాద‌ని అమ్మాయి బ్రేక‌ప్ అవుతుంది. అప్ప‌టి నుంచి వివేక్ మూడాఫ్ అవుతాడు. అంత‌కు ముందు తీసిన ఎనిమిది షార్ట్ ఫిల్మ్స్ ల‌ను కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయ‌డు. ఒక‌వేళ అవి అప్ లోడ్ అయ్యాక బాగాలేద‌ని ఎవ‌రైనా అంటే, త‌న ప్ర‌తిభ న‌లుగురికి న‌చ్చ‌క‌పోతే ఉన్న స్నేహితులు కూడా త‌న‌కు దూర‌మ‌వుతార‌నేది అత‌ని బాధ‌. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎవ‌రికి వారు వేర‌య్యి, ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వాళ్లు సాగిస్తుంటారు. ఈ స‌మ‌యంలోనే కార్తిక్ త‌న ప‌బ్ ఓన‌ర్ కుమార్తెను వివాహం చేసుకుని యుస్‌కి వెళ్లాల‌నుకుంటాడు. త‌న ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాడు. త‌న ఫియాన్సేకి తొడిగే రింగ్‌ను ఫ్రెండ్స్ కు చూపిస్తాడు. అనుకోకుండా అది మిస్ అవుతుంది. తాగిన మ‌త్తులో అంద‌రూ గోవా చేరుకుంటారు. అనుకోకుండా అక్కడికి వెళ్లిన వాళ్ల‌కి ఆ రింగ్ కోసం ఆరాటం మొద‌ల‌వుతుంది. దాన్ని దొర‌క‌బుచ్చుకున్నారా?  కొత్త‌ది కొన్నారా? ఖ‌రీదైన ఆ రింగ్‌ను కొన‌డానికి వాళ్లేం చేశారు?  వంటివ‌న్నీ ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు.

ప్ల‌స్ పాయింట్లు:

ఈ సినిమాను యూత్‌ని టార్గెట్ చేసి తెర‌కెక్కించాడు త‌రుణ్‌. సీన్స్ వైజ్ అక్క‌డ‌క్క‌డా చాలా బాగా రాశాడు. కామెడీ మీద గ్రిప్ ఉంది త‌రుణ్‌కి. అందులోనూ నేటి యూత్ మాట్లాడే భాష‌లో నుంచి, అవే డైలాగుల‌ను పెట్టి కామెడీని క్రియేట్ చేయ‌డం బావుంది. వివేక్ సాగ‌ర్ సౌండింగ్‌ని మెచ్చుకోవాలి. పాట‌లు పెద్ద‌గా ఎక్క‌వు. విన్నా గుర్తుండే ట్యూన్లు కావు. కాక‌పోతే స్క్రీన్ మీద బోర్ అనిపించ‌లేదు. కెమెరా ప‌నిత‌నం బావుంది. స్పీడ్‌గా మూవ్ అవుతూ, కొన్ని చోట్ల క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. సినిమా మూడ్స్ కి త‌గ్గ‌ట్టు ఎంచుకున్న క‌ల‌ర్ బావుంది. కాస్ట్యూమ్స్ ని మెచ్చుకోవాలి. ఎక్క‌డా ఓవ‌ర్ ఎమోట్ కాకుండా, స‌హ‌జంగా తీసే ప్ర‌య‌త్నం చేశాడు త‌రుణ్‌.

మైన‌స్ పాయింట్లు:

సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఫ్రెండ్స్ క‌ల‌వాలంటే బారే. బీరు బాటిళ్లు చేతిలో ఉండాల్సిందే. ప‌బ్బుల్లో క‌నిపించాల్సిందే. అలా కాకుండా స్నేహితులు హ్యాంగ్ ఔట్ అయ్యే మ‌రిన్ని ప్లేస్‌ల‌ను చూపించాల్సిందేమో త‌రుణ్‌. ఎప్పుడూ రియ‌ల్ ఇన్సిడెంట్స్ వ‌ర్కవుట్ అవుతాయ‌ని అనుకోకూడ‌దు. ఇందులో సిట్చువేష‌న‌ల్ కామెడీ పండింది. కానీ క‌థ‌లో బ‌లం లేకుండా ప్ర‌తిసారీ ఇలాంటి జిమ్మిక్కులు ప‌నికిరావు. ఈ సినిమా ప‌రంగా క‌థ చాలా పేల‌వంగా ఉంది. రొటీన్ సినీ ప్రియుల‌ను ఆక‌ట్టుకునే ఫైట్లు, డ్యాన్సులు వగైరాలు లేవు. సెకండాఫ్ క‌థ‌ని న‌డ‌ప‌డంలో ద‌ర్శ‌కుడు కొంచెం తిక‌మ‌క‌ప‌డ‌టాన్ని గ‌మనించ‌వచ్చు.

విశ్లేష‌ణ‌:

`ఈ న‌గ‌రానికి ఏమైంది` అని, సినీ ప్రియుల‌కు ష‌రా మామూలుగా అర్థ‌మ‌య్యే టైటిల్‌తో ఆక‌ట్ట‌కున్నాడు త‌రుణ్ భాస్క‌ర్‌. అత‌ను ముందే చెప్పిన‌ట్టుగా ఈ సినిమా ఎక్కువ‌గా ఆల్క‌హాల్ చుట్టూ తిరిగింది. కెరీర్‌లో యాంబిష‌న్స్, వాటి వెనుక ఛేజ్‌, ఫ్యామిలీ సిట్చువేష‌న్స్, గ‌ర్ల్ ఫ్రెండ్స్, మూడ్స్... అని నేటి యూత్ కి ఉన్న ప్ల‌స్‌లు, మైన‌స్‌లు అన్నిటినీ చెప్ప‌క‌నే చెప్పాడు త‌రుణ్‌. కౌశిక్ పాత్ర లేకుంటే ఈ సినిమా ఫ‌లితం మ‌రోలా ఉండేది. ఈ సినిమాకు ప్రాణం కౌశిక్ పాత్ర‌. వివేక్ పాత్ర‌లో న‌టించిన విష్వ‌క్సేన్ హ‌లీవుడ్ న‌టుడిలాగా ఉన్నాడు. కార్తిక్ పాత్ర‌లో న‌టించిన సుశాంత్ రెడ్డి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ నేటి మ‌ధ్య త‌ర‌గ‌తి అబ్బాయిల మ‌న‌స్త‌త్వాన్ని ప్ర‌తిబింబిస్తుంది. చెప్పేది మంచి అయిన‌ప్పుడు బారుల్లో, బీరుల‌తో కాకుండా, ఇంకో నేప‌థ్యంతో చెప్పి ఉంటే బావుండేది. సెకండాఫ్ లో కాసింత ఎడిటింగ్ చేసుకుని, ఇంకాస్త క్లుప్తంగా సినిమాను ముగించి ఉంటే ఇంకా ఎక్కువ అప్లాజ్ వ‌చ్చేది.

బాట‌మ్ లైన్‌: ఇది... 'న‌గ‌ర' స‌ర‌దా

Rating: 2.75 / 5.0

Showcase your talent to millions!!

Write about topics that interest you - anything from movies to cricket, gadgets to startups.
SUBMIT ARTICLE