ఏపీలో బదిలీ అధికారుల స్థానంలో ఈసీ కొత్త నియామకాలు

  • IndiaGlitz, [Thursday,April 04 2024]

ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. తాజగా వారి స్థానంలో కొత్త అధికారులను నియమిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం రాత్రి 8గంటల లోపు ఛార్జ్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కొత్త కలెక్టర్లు వీరే..

కృష్ణా జిల్లా కలెక్టర్‌ - డి.కె.బాలాజీ
అనంతపురం కలెక్టర్‌ - వి.వినోద్‌కుమార్‌
తిరుపతి కలెక్టర్‌ - ప్రవీణ్‌కుమార్‌

కొత్త ఎస్పీలు వీరే..

గుంటూరు ఐజీ - సర్వశ్రేష్ఠ త్రిపాఠి
ప్రకాశం జిల్లా ఎస్పీ - సుమిత్‌ సునీల్‌
పల్నాడు జిల్లా ఎస్పీ- బిందు మాధవ్‌
చిత్తూరు ఎస్పీ - మణికంఠ చందోలు
అనంతపురం ఎస్పీ- అమిత్‌ బర్దార్‌
నెల్లూరు ఎస్పీ- ఆరిఫ్‌ హఫీజ్‌

కాగా వైసీపీ నేతలకు అనుకూలంగా.. ప్రతిపక్ష నేతలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులతో ఐదుగురు ఎస్పీలు, ఓ ఐజీ, ముగ్గురు కలెక్టర్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన అధికారుల్లో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి , పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అన్బురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు ఉన్నారు. అలాగే ఐఏస్ అధికారుల్లో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజబాబు, అనంతపురం ఎన్నికల అధికారి గిరీజా, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషాలను కూడా బదిలీ చేసింది. వీరికి ఎన్నికలు పూర్తి అయ్యే వరకు విధులు అప్పగించకూడదని కూడా ఆదేశాలు జారీ చేసింది.

More News

Buddha Prasad: అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్.. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పు..

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పేరు ఖరారుతో పాటు రైల్వేకోడూరు అభ్యర్థిని మారుస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.

YSRCP: గ్రౌండ్‌లోకి దిగిన సీఎం జగన్.. గణనీయంగా పెరిగిన వైసీపీ గ్రాఫ్..

ఎన్నికల ప్రచారంలో అధికార వైసీపీ దూసుకుపోతుంది. రాష్ట్రంలో ఎవరి నోట విన్నా జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే మాటే వినిపిస్తోంది.

తమిళ స్టార్ హీరో అజిత్‌కు కారు ప్రమాదం.. షాకింగ్ వీడియో వైరల్..

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రొఫెసర్ రేసర్ అని తెలిసిందే. ఎక్కువగా బైక్‌పై ట్రావెల్ చేస్తూ ఉంటాడు. అలాగే తన సినిమాల్లో కూడా యాక్షన్ సీక్వెన్స్ డూప్‌లు లేకుండానే చేస్తాడు.

Sonia Gandhi: రాజ్యసభ సభ్యులుగా సోనియా గాంధీ, తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రమాణం

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ భవన్‌లో ఉపరాష్ట్రపతి జగ్‌దీఫ్ ధన్‌కర్‌ ఆమె చేత ప్రమాణం చేయించారు.

కడప నుంచి ఎన్నికల యుద్ధంలోకి వైయస్ షర్మిల.. ప్రచారం షెడ్యూల్ ఖరారు...

ఏపీలో ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇప్పటికే తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన హస్తం పార్టీ ఇకపై ప్రచారంపై దృష్టి పెట్టింది.