బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న డ‌స్కీ బ్యూటీ..ఎవ‌రితో జ‌త క‌డుతుందో తెలుసా?

  • IndiaGlitz, [Sunday,January 19 2020]

టాలీవుడ్‌లో అంతంత మాత్రంగా అవ‌కాశాల‌తో స‌త‌మ‌వుతూ వ‌చ్చిన డ‌స్కీ బ్యూటీ ఈషారెబ్బాకు పెద్ద అవ‌కాశ‌మే ద‌క్కింది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు ఈమె బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధ‌మైంది. స‌మాచారం మేర‌కు అనిల్ క‌పూర్ త‌న‌యుడు.. హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ సోద‌రుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ బాలీవుడ్ రంగ ప్ర‌వేశం చేస్తున్నాడు. ఈ యువ క‌థానాయ‌కుడితో క‌లిసి ఈషా రెబ్బా న‌టించ‌నుందట‌. జాతీయ అవార్డ్ ద‌క్కించుకున్న స్క్రీన్‌ప్లే రైట‌ర్ రాజ్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయ‌బోతున్న‌ట్లు టాక్‌. ఈషా రెబ్బా రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి ఆడిష‌న్ ఇచ్చింద‌ట‌. గ‌త చిత్రాల్లో ఈషా వ‌ర్క్ న‌చ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను హీరోయిన్‌గా తీసుకోవ‌డానికి ఓకే అయ్యార‌ట‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన అధికారిక స‌మాచారం రావాల్సి ఉంది.

మ‌హిళా సాధికార‌త అనే పాయింట్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో ఈషారెబ్బా రాజ‌స్థానీ అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఎమోష‌న‌ల్‌గా సాగే పాత్ర‌కు ఈషారెబ్బా న్యాయం చేస్తుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు న‌మ్మార‌ట‌. తెలుగులో 'రాగ‌ల 24 గంట‌ల్లో' చిత్రంలో మెయిన్ లీడ్‌గా న‌టించిన ఈషా రెబ్బాకు ఇదొక మంచి అవ‌కాశమ‌నే చెప్పొచ్చు.

More News

`RRR` విడుద‌ల తేదీపై రాజ‌మౌళి తెలివిగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడా?

ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `RRR`. `బాహుబ‌లి` వంటి సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం

గోవాలో సొంతిల్లు.. సమంత కోరిక ఇదేనట!

సొంతిల్లు అంటే ఎవరికైనా మక్కువే. జీవితకాలంలో తనకంటూ ఓ ఇల్లు ఉండాలని ఎవరైనా భావిస్తుంటారు.

జగన్ పిలిచి పదవి ఇస్తానంటే.. పోసాని చెప్పిన మాటేంటో తెలుసా?

సినీ ఇండస్ట్రీలో పోసాని కృష్ణమురళీ ఎంత పాపులరో అందరికీ తెలిసిన విషయమే. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఆయన విలక్షణమైన పాత్రలను పోషించారు.

రెబల్ స్టార్ కృష్ణంరాజు బర్త్ డే సెలబ్రేషన్

దాదాపు 350కిపైగా చిత్రాల్లో నటించి.. సినీప్రియుల మదిలో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకోవడమే కాక, నిర్మాతగానూ పదుల సంఖ్యలో హిట్‌ చిత్రాలు నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు

‘ఒరేయ్‌.. బుజ్జిగా’ షూటింగ్ పూర్తి. ఏప్రిల్ 3న విడుదల

యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో