సెన్సార్ పూర్తి చేసుకొన్న 'ఇగో'

  • IndiaGlitz, [Tuesday,January 09 2018]

'ఆకతాయి' ఫేమ్‌ ఆశిష్‌ రాజ్, సిమ్రాన్‌ జంటగా రూపొందుతోన్న సినిమా "ఇగో". సుబ్రమణ్యం దర్శకత్వంలో విజయ్‌ కరణ్‌–కౌసల్‌ కరణ్‌–అనిల్‌ కరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఇవాళ పూర్తయ్యాయి. యు/ఎ సర్టిఫికేట్ అందుకొన్న "ఇగో" చిత్రాన్ని జనవరి 19న విడుదల చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. "హిలేరియస్ అండ్ ఎమోషనల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన చిత్రం 'ఇగో'. నవతరం ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రం యువతరంతోపాటు పెద్దలకు కూడా నచ్చేలా సినిమా ఉంటుంది. ఆశీష్ రాజ్ హీరోగా ఒక మెట్టు ఎక్కుతాడు. సిమ్రాన్, దీక్షా పంత్ ల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. అలాగే సాయికార్తీక్ సమకూర్చిన నేపధ్య సంగీతం సినిమాకి హెల్ప్ అవుతుంది. ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చి మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు.

ఆశిష్ రాజ్, సిమ్రాన్, దీక్ష పంత్, రావు రమేష్, పోసాని, పృథ్వి, అజయ్, శకలక శంకర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటర్: శివ వై ప్రసాద్, డీఓపీ: ప్రసాద్ జి. కె, స్టిల్స్: వికాస్, వి ఎఫ్ ఎక్స్: తేజ్ దిలీప్, మ్యూజిక్ డైరెక్టర్: సాయి కార్తీక్, ప్రొడ్యూసర్స్: విజయ్ కరణ్, కౌషల్ కరణ్, అనిల్ కరణ్, కథ- డైరెక్షన్: సుబ్రహ్మణ్యం ఆర్.వి. (సుబ్బు).

More News

శివాని సినిమా కన్ ఫర్మ్..

జీవితా రాజశేఖర్ తనయ శివాని తెరంగేట్రానికి రంగం సిద్ధమైంది.

హెబ్బాపటేల్ కొత్త మూవీ డిటైల్స్

'అలా ఎలా','కుమారి 21 ఎఫ్',`ఈడోరకం ఆడోరకం' సినిమాలతో వరుస విజయాలను అందుకున్న ముద్దు గుమ్మ హెబ్బా పటేల్

ఫిబ్రవరికి వాయిదాపడిన 'రాజుగాడు'?

రాజ్ తరుణ్ హీరోగా సంజనా రెడ్డి రూపొందించిన చిత్రం‘రాజుగాడు’.ఇందులో అమైరా దస్తర్ కథానాయికగా నటించింది.

నాయక్' కు 5 ఏళ్ళు

చెడు మీద మంచి విజయం సాధించాలంటే ఆ మంచికి ప్రోత్సాహం,మద్దతు కూడా ఉండాలి..

నితిన్ కేసును కొట్టివేసిన కోర్టు...

హీరో నితిన్‌కు స్వంత నిర్మాణ సంస్థ శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నితిన్ సోద‌రి నికితారెడ్డి, నితిన్ తండ్రి, డిస్ట్రిబ్యూట‌ర్ సుధాక‌ర్ రెడ్డి కూడా భాగ‌స్వామ్యులే. అఖిల్ హీరోగా ప‌రిచ‌య‌మైన 'అఖిల్‌' సినిమాను నితిన్ నిర్మించాడు.