close
Choose your channels

‘ఏక్ మినీ కథ’ పోస్టర్ ఏం చెబుతోందంటే..

Tuesday, March 9, 2021 • తెలుగు Comments

‘ఏక్ మినీ కథ’ పోస్టర్ ఏం చెబుతోందంటే..

కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్న నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్. దీనికి అనుబంధ సంస్థగా యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌ను స్థాపించారు. ఈ బ్యానర్‌లో నిర్మాణం పూర్తి చేసుకున్న చిత్రం ‘ఏక్ మినీ కథ’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సోమవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘డజ్ సైజ్ మ్యాటర్’ అంటూ పోస్టర్‌లో ఉన్న మ్యాటర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘పేపర్ బాయ్’ సినిమాతో నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న సంతోష్ శోభన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

పోస్టర్‌లో ఉన్న సంతోష్ శోభన్ లుక్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా లాంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథ అందించారు. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గోకుల్ భారతి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్నారు. సత్య ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే తెలియజేయనుంది.

సంతోష్‌ శోభన్‌ని ఒక భారీ టేపుతో చుట్టేసినట్లుగా ఉన్న పోస్టర్‌‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అలాగే సోషల్‌ మీడియాలో మంచి స్పందనను రాబట్టుకుంటోంది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల మిక్సింగ్‌తో ఉన్న ఈ టైటిల్‌తో పాటు 'డజ్‌ సైజ్‌ మ్యాటర్‌' అంటూ పోస్టర్ లో ఉన్న మ్యాటర్ చూస్తుంటే.. ఇది టైటిల్ పరంగా మినీ కథే.. కానీ సినిమా మొత్తం భారీ ట్విస్ట్‌లతో నిండి ఉటుందనిపిస్తోంది. మొత్తానికి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి మ్యాటర్‌ను రాబట్టుకుంటోంది.

Get Breaking News Alerts From IndiaGlitz