Download App

Ek Mini Katha Review

ప్రస్తుతం మీడియం, చిన్న తరహా చిత్రాలు ఓటిటీలో ప్రవాహంలా విడుదలవుతున్నాయి. యువ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం 'ఏక్ మినీ కథ' నేడు ప్రైమ్ వీడియోలో విడుదలయింది. అడల్ట్ కామెడీ కంటెంట్ తో ఉన్న ఈ చిత్ర ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

హీరో సంతోష్(సంతోష్ శోభన్) ఒక సివిల్ ఇంజనీర్ గా పనిచేస్తుంటాడు. అతడికి వ్యక్తిగతంగా ఓ శృంగార పరమైన సమస్య ఉంటుంది. తన ప్రయివేట్ పార్ట్ చిన్నగా ఉందని ఎప్పుడూ మదనపడుతూ ఉంటాడు. ఎన్ని ప్రయత్నాలు చేసిన అతడి సమస్యకు సరైన పరిష్కారం లభించదు. తన క్లోజ్ ఫ్రెండ్స్ కి కూడా తన చిన్న సైజ్ విషయం చెప్పలేక ఇబ్బంది పడుతుంటాడు. అలాంటి సంతోష్ కి లైఫ్ లో అన్ని పెద్దవి కావాలని కోరుకునే హీరోయిన్ అమృత (కావ్య థాపర్) పరిచయం అవుతుంది. వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. సంతోష్ తన ప్రైవేట్ పార్ట్ సమస్యని అధికమించగలిగాడా ? తన ప్రేయసితో ఏ విషయం చెప్పగలిగాడా ? చివరకు ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

అడల్ట్ కామెడీ, సెక్స్ ఎడ్యుకేషన్ పేరుతో గతంలో కొన్ని వల్గర్ చిత్రాలు వచ్చాయి. కానీ ఈ చిత్రం ఆ కోవకు చెందినది కాదు. ఆ మంచి పాయింట్ సెన్సిబుల్  గా డీల్ చేశారు. ఫస్ట్ హాఫ్ ప్రెజెంటర్ చేసిన విధానం బావుంది.చాలా సినిమాల్లో చూసిన మిస్ అండరస్టాండింగ్ చుట్టూ తిరిగే సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. పెళ్లి చూపుల్లో హీరో హీరోయిన్ ని అపార్థం చేసుకోవడం, ఆ తర్వాత రియలైజ్ కావడం వంటివి ఇదివరకే చూశాం.

ఇలాంటి చిత్రాల్లో కామెడీ తప్పనిసరి. హీరో సమస్యని మొదట కామెడీగా చూపించి..ఆ తర్వాత దానితోనే ఎమోషన్ పండించడంలో చిత్ర సక్సెస్ అయ్యారు. హాస్యం హద్దులు దాటకుండా జాగ్రత్త పడ్డారు. కథ మొత్తం హీరో ప్రైవేట్ పార్ట్ చుట్టూ తిరగడంతో సాగదీత గురైన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఐతే సినిమా ట్రాక్ తప్పిందా అని ఫీలింగ్ కలగక మానదు. ఎమోషనల్ గా ప్రజెంట్ చేయబడ్డ ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాని కాస్త నిలబెట్టాయి.

హీరో హీరోయిన్ కు పెళ్లి కాగానే.. సైజ్ సంగతి ఎప్పుడు రివీల్ అవుతుందా..హీరోయిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అనే దానికోసమే ప్రేక్షకుడు ఎదురుచూస్తారు. మిగిలిన సీన్స్ అన్ని సాగదీయడం కోసమే అని క్లియర్ గా అర్థం అయిపోతుంది.

నటీనటులు:

హీరో సంతోష్ ని ప్రత్యేకంగా అభినందించాలి. అవసరమైన చోట అవసరమైన ఎమోషన్ ఇవ్వగలిగాడు. హీరోయిన్ కోసం ఏమైనా చేయాలి అని డిసైడ్ అయినప్పుడు..హీరో హావ భావాలే కీలకం అవుతాయి. అందులో సంతోష్ సక్సెస్ అయ్యాడు.

కమెడియన్ సుదర్శన్ కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఫస్ట్ హాఫ్ కామెడీలో అతడిదే సింహ భాగం. హీరోయిన్ కావ్య పాత్రకు పెద్దగా నటించే స్కోప్ దొరకలేదనే చెప్పాలి. అవసరమైన సీన్స్ లో హీరో పక్కన కనిపించడమే ఆమె రోలా అనే సందేహం కలుగుతుంది. కొన్ని చోట్ల గ్లామర్ గా కనిపించే అవకాశం దొరికింది.

ఇక పోసాని, బ్రహ్మాజీ, హర్షవర్ధన్ తమ పాత్రల్లో సెట్ అయ్యారు. సెకండ్ హాఫ్ లో వచ్చే సప్తగిరి పాత్ర చికాకు పుట్టించే విధంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు.

టెక్నికల్ గా :

కామెడీ పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. అలాగే క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్ ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. ప్రవీణ్ సంగీతం ఓకే అనిపిస్తుంది. సినిమా టోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కథలోని పాయింట్, హీరో నటన, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ఫ్రెష్ లుక్ తెచ్చిపెట్టాయి. సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బెటర్ వర్షన్ ఏక్ మినీ కథ తయారయ్యేదేమో.

ఫైనల్ పంచ్ :

సైజు అనే బోల్డ్ కాన్సెప్ట్ ని అవసరమైన కామెడీ, ఎమోషన్స్ తో చెప్పాలనుకోవడం మంచి ప్రయత్నం. కానీ కథలో అదొక్కటే అంశం కావడం, సెకండ్ హాఫ్ ని సాగదీయడం మైనస్ గా మారింది. సంతోష్ శోభన్ నటన, సుదర్శన్ కామెడీ, డీసెంట్ ఫస్ట్ హాఫ్, ఎమోషనల్ క్లైమాక్స్ లాంటి ప్లస్ పాయింట్స్ ఈ చిత్రంలో ఉండడం వల్ల 'ఏక్ మినీ కథ' ని ఓ సారి చూడవచ్చు.

Read 'Ek Mini Katha' Review in English

Rating : 2.8 / 5.0