ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ '9' మోషన్ పోస్టర్ విడుదల!

  • IndiaGlitz, [Thursday,April 20 2017]

గోస్ట్ హంటింగ్ కాన్సెప్ట్ తో తెలుగులో తెరకెక్కుతోన్న చిత్రం "9". అశ్వనీ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ పతాకంపై శ్వేత సింగ్ నిర్మిస్తున్నారు. నేడు ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను ఆన్ లైన్ లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్వేత సింగ్ మాట్లాడుతూ.. "ఒక వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ప్రయోగాత్మక చిత్రం "9". హీరోయిన్ సెంట్రిక్ గా సాగే హారర్ ఎంటర్ టైనర్. ఒక దెయ్యాలను పట్టుకోనే బృందం ఓ దెయ్యాలు సంచరించే స్థలానికి పరిశోధన కోసం వెళ్ళి.. అక్కడ జరిగే పారానార్మల్ యాక్టివిటీస్ ను ఇన్విస్టిగేట్ చేసే క్రమంలో ఎదుర్కొన్న పరిస్థితుల సమాహారమే ఈ చిత్రం. మదనపల్లిలోని హార్స్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లోనే మాగ్జిమమ్ షూటింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం" అన్నారు.
అతుల్ కులకర్ణి, కబీర్ దుహన్ సింగ్, అర్చన శాస్త్రి, ఆశిమా నార్వల్, సరితా చందనా, విమల్ కృష్ణ, పావని గంగిరెడ్డి, అభిషేక్ మహర్షి, అభినవ్ గోమతం, పూర్ణిమా మౌడ్గిల్, సుధారాణి, సమీర్ హాసలు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పబ్లిసిటీ పోస్టర్స్ డిజైనర్స్: అనిల్ భాను, కొరియోగ్రాఫర్: ఉదయ్ భాను, వి.ఎఫ్.ఎక్స్: వెంకట్.కె, కాస్ట్యూమ్స్: అశ్వంత్ బైరి, మాటలు-పాటలు: కిట్టు విస్సాప్రగడ, సౌండ్ డిజైనర్స్: విష్ణు పిసి-ఎస్.అరుణ్, ఎడిటర్: గ్యారీ.బిహెచ్, ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మన్నే, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం. రమేష్ శర్మ, సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్.ఎన్, నిర్మాణం: ఏకా ఆర్ట్ ప్రొడక్షన్స్, నిర్మాత: శ్వేత సింగ్, దర్శకత్వం: అశ్వని కుమార్.వి!