పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దంగా ఉన్న 'ఏమైపోయావే'

  • IndiaGlitz, [Monday,October 26 2020]

శ్రీరామ్ క్రియేషన్స్, వీఎం స్టూడియోస్ పతాకాలపై మురళి దర్శకత్వంలో రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి హీరోహీరోయిన్లుగా నిర్మాత హరి కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'ఏమైపోయావే'. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మోషన్ పొస్టర్ కు మంచి స్పందన లభించింది.

ఈ సందర్బంగా నిర్మాత హరికుమార్ మాట్లాడుతూ... ''మా బ్యానర్లో 'ఏమైపోయావే' చిత్రం ఒక మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. సినిమా బాగా రావడానికి ఆర్టిస్ట్స్, టెక్నిషియన్స్ ఎంతగానో సహకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయిన మా చిత్ర సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తాం, అందరికీ నచ్చే విధంగా ఈ సినిమా ఉండనుంది అన్నారు.

రాజీవ్ సిద్ధార్థ్, భవాని చౌదరి, శాను మజ్జారి, శ్రీను కేసబోయిన, మిర్చి మాధవి, సునీత మనోహర్, నామాల మూర్తి, మీసం సురేష్, మళ్ళీ రావా బుజ్జి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: శాంతి పుత్ర విజయ్, సినిమాటోగ్రఫీ: శివ రాధోడ్, సంగీతం: రామ్ చరణ్, పాటలు: తిరుపతి జానవ, పీఆర్వో: సాయి సతీష్, నిర్మాత: హరి కుమార్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మురళి.

More News

డిఫ‌రెంట్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ `మాయ‌` టీజర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు మారుతి!

ప్రవాస భారతీయురాలైన రాధికా జయంతి దర్శకత్వంలో తెర‌కెక్కిన చిత్రం `మాయ`. సంధ్య బయిరెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ పోషించ‌గా,

విజయదశమి కానుకగా పేదలకు సొంతింటి కల సాకారం: కేటీఆర్

తెలంగాణ ప్రభుత్వం విజయదశమి కానుకగా పేదలకు సొంతింటి కలను సాకారం చేసిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

కేరళలో జరిగిన ఆ మూడు వివాహాలు ఆద్యంతం ఆసక్తికరమే..

కేరళలో ఒకే వేదికపై మూడు వివాహాలు జరిగాయి. దీనిలో ఆసక్తికరమేముంది అంటారా? ఆ ముగ్గురూ కవలలు కావడమే ఆసక్తికరం.

రేణు దేశాయ్ 'ఆద్య' ఆరంభం!!

ఒక పవర్ ఫుల్ లేడి ఓరియంటెడ్ పాన్ ఇండియా వెబ్ సిరీస్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ కి శ్రీకారం చుట్టారు రేణు దేశాయ్.

మన చుట్టూ ఉన్న చెత్తను గుర్తించాలి:  పూరీ జగన్నాథ్‌

పలు విషయాలపై అవగాహన పెంచుతూ తనకు తెలిసిన విషయాల గురించి ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ మ్యూజింగ్స్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.