close
Choose your channels

ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ చేతుల  మీదుగా ‘పోస్టర్‌’ సాంగ్‌ లాంచ్‌

Wednesday, March 18, 2020 • తెలుగు Comments

ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ చేతుల  మీదుగా ‘పోస్టర్‌’ సాంగ్‌ లాంచ్‌

శ్రీ సాయి పుష్పా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై టి.మహిపాల్‌ రెడ్డి (టిఎమ్‌ఆర్‌) దర్శకుడిగా విజయ్‌ ధరన్‌, రాశి సింగ్‌, అక్షత, సోనావానే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘పోస్టర్‌’. ఈ చిత్రంలోని రెండు సింగిల్స్‌ ఇప్పటికే విడుదలై మంచి వ్యూస్‌ రాబట్టుకున్నాయి. ఇటీవల గుంటూరులోని వివిఐటి ఇంజనీరింగ్‌ కళాశాలో పదివేల మంది ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌తో పోస్టర్‌ చిత్రానికి సంబంధించిన ‘నువ్వంటే ఎవరంట మిత్రమా’ అంటూ సాగే మోటివేషనల్‌ సాంగ్‌ లాంచ్‌ చేశారు.

ఈ సందర్భంగా

దర్శకుడు మహిపాల్‌ రెడ్డి మాట్లాడుతూ...‘ఇప్పటికే మా చిత్రానికి సంబంధించిన రెండు సింగిల్స్‌, టీజర్‌ విడుదలై సినిమాకు మంచి బజ్‌ తీసుకొచ్చాయి. ఇక తాజాగా గుంటూరులో పదివేల మంది ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ చేతుల మీదుగా ‘నువ్వంటే ఎవరంట మిత్రమా’ అంటూ సాగే మోటివేషనల్‌ సాంగ్‌ లాంచ్‌ చేశాం. స్టూడెంట్స్‌ నుంచి పాటకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. యూత్‌ని ఉత్తేజపరుస్తూ...వారిలో నూతనోత్సాహాన్ని, స్ఫూర్తిని నింపేలా ప్రముఖ పాటల రచయిత పెద్దాడ మూర్తి గారు సాహిత్యాన్ని సమకూర్చగా హేమచంద్రగారు తన గొంతుతో ప్రాణం పోశారు. ఇక శాండీ అద్దంకి అద్భుతమైన బాణీలు ఇచ్చారు. సినిమా పనులు అన్ని పూర్తయ్యాయి. త్వరలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం. పోస్టర్‌ అంటించడానికి కూడా పనికి రాని ఒక వ్యక్తి .. పోస్టర్‌ మీదకు ఎక్కే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది సినిమా కాన్సెప్ట్‌. సమస్యలు వస్తే ఎదుర్కొవాలి తప్ప వాటి నుంచి పారిపోవడమో , కృంగి పోవడమో చేయొద్దు అనే సందేశాన్ని అంతర్లీనంగా ఇస్తున్నాం ’’ అన్నారు.

ఇందులో శివాజీ రాజా, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాధ్‌, స్వప్నిక, అరుణ్‌ బాబు, జగదిశ్వరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు : నివాస్‌, సంగీతం: శాండీ అద్దంకి, కెమెరా: రాహుల్‌, ఎడిటర్‌: మార్తాండ కె వెంకటేష్‌, నిర్మాతలు :టి.శేఖర్‌ రెడ్డి, ఏ.గంగారెడ్డి, మరియు ఐ.జి రెడ్డి. రచన-దర్శకత్వం టి.యం.ఆర్‌.

Get Breaking News Alerts From IndiaGlitz