సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న 'ఎంత వరకు ఈ ప్రేమ'

  • IndiaGlitz, [Friday,November 04 2016]

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. 'యామిరుక్క బ‌య‌మేన్‌' ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.
డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- ' సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌యి ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈమధ్యే విడుదలైన పాటలకు సైతం అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. జీవా, కాజ‌ల్ జంట న‌టించిన ప్ర‌తి సీన్ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్‌, అభినంద‌న్ రామానుజ‌మ్ సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎసెట్ అవుతాయి. తెలుగులో వెన్నలకంటిగారు అందించిన మాట‌లు, పాట‌లు చాలా చక్కగా కుదిరాయి. ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెప్పిన క‌ళాకారులు కూడా సినిమా చాలా బాగా ఉంద‌ని మెచ్చుకున్నారు. ఈ సినిమా అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సినిమా ప్రేక్షకుల మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఆహ్లాదంగా ఉంటుంది. జీవా, కాజ‌ల్ న‌ట‌న‌తో పాటు మిగ‌తా ఆర్టిస్టుల పెర్‌ఫార్మ‌న్స్‌, టెక్నిషియ‌న్ స‌పోర్ట్‌తో సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమాను ఈనెలలో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం.' అన్నారు.
జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.

More News

మీలో ఎవరు కోటీశ్వరుడు నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మించే 3 చిత్రాల వివరాలు..!

అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్టైగర్ చిత్రాలతో సూపర్హిట్స్ అందించిన నిర్మాత కె.కె.రాధామోహన్. ప్రస్తుతం లక్ష్మీరాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై పృథ్వీ, నవీన్చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో మీలో ఎవరు కోటీశ్వరుడు అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ రిలీజ్..!

అల్ల‌రి న‌రేష్ హీరోగా జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హర్ర‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ ఇంట్లో దెయ్యం నాకేం భ‌యం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర పతాకం పై బి.వి.ఎస్.ఎన్.ప్ర‌సాద్ నిర్మించారు.

అంతటి ధైర్యవంతుల మధ్య గడపడం నా అదృష్టం : మెహరీన్ కౌర్ పిర్జాదా

నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. అందరి మనసులో చెరగని సంతకం చేసింది మేహరీన్. నాని కథానాయకుడిగా నటించిన "కృష్ణగాడి వీరప్రేమగాధ"తో కథానాయకిగా తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ సుందరి మెహరీన్ పుట్టినరోజు రేపు (నవంబర్ 5).

త్రిష పెళ్లి క్యాన్సిల్ కి కార‌ణం ఇదే..!

చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌,వెంక‌టేష్...ఇలా అగ్ర‌హీరోల‌తో న‌టించి తెలుగులో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న క‌థానాయిక త్రిష‌. తెలుగు, త‌మిళ్ చిత్రాల్లో న‌టిస్తూ సౌత్ లో బాగా పాపుల‌ర్ అయిన త్రిష ఎంగేజ్ మెంట్ త‌ర్వాత పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

నా గురువు & నా హీరోకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు - జ‌గ‌ప‌తి..!

నా గురువు & నా హీరోకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అని జ‌గ‌ప‌తి బాబు ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. ఇంత‌కీ...జ‌గ్గుభాయ్ బ‌ర్త్ డే విషెష్ చెప్పింది ఎవ‌రికి అని అనుకుంటున్నారా..?