close
Choose your channels

ఎంట్రన్స్ పరీక్షల తేదీలు ఖరారు..

Monday, August 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో ఎంట్రన్స్ టెస్టులను గతంలో ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే. తిరిగి ఈ ఎంట్రన్స్ టెస్టులు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. చివరకు ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసింది. టీపీఎస్ ద్వారా ఆన్‌లైన్ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పరీక్ష తేదీలను కూడా ఖరారు చేసింది. ఈ నెల 31వ తేదీన ఈసెట్.. సెప్టెంబర్ 9, 10, 11, 14న ఎంసెట్.. సెప్టెంబర్ 2వ తేదీన పాలిసెట్ నిర్వహించనుంది.

కాగా ఇంటర్ అడ్మిషన్లపై సెప్టెంబర్ 1వ తదీ తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 20వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు తీసుకోనుంది. దూరదర్శన్, టీశాట్ ద్వారా క్లాసెస్ నిర్వహించనుంది. టీచర్లకు అటెండెన్స్ 50 శాతం తప్పని చేసింది. 17 నుండి ఇంటర్ ఆన్లైన్, డిజిటల్ క్లాసెస్ తీసుకోనున్నారు. దోస్త్ డిగ్రీ అడ్మిషన్స్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.