'ఎర్ర‌చీర‌' లో తొలి తొలి ముద్దు రొమాంటిక్ గీతం

  • IndiaGlitz, [Wednesday,December 04 2019]

శ్రీ సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బేబి ఢ‌మరి సమర్పణలో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న‌ చిత్రం 'ఎర్రచీర'. సి.హెచ్ సుమ‌న్ బాబు స్వీయద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తున్నారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన ఈ హర్రర్ చిత్రంలో న‌ట‌కిరీటి డా.రాజేంద్ర ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ధారి. మ‌హాన‌టి ఫేం బేబి సాయి తేజ‌స్విని, సి.హెచ్ సుమన్‌బాబు, కారుణ్య, సంజ‌నా శెట్టి, కమల్‌ కామరాజు, శ్రీరామ్, భానుశ్రీ, అజయ్‌, ఉత్తేజ్‌, మహేష్‌లు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. శివ శివ శంభో శంక‌ర అనే పాటకు ఇంత‌కుముందు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి 'తొలి తొలి ముద్దు.. ముద్దు పైన 150 ముద్దులు..' పాట‌ను రిలీజ్ చేసింది చిత్ర‌బృందం. సినిమాలో రొమాంటిక్ సాంగ్ ఇది. ఈ పాట‌కు కె.స‌త్య‌సుమ‌న్ బాబు లిరిక్ అందించ‌గా అంజ‌నా సౌమ్య‌- హేమ‌చంద‌ర్ పాడారు.

దర్శక నిర్మాత మాట్లాడుతూ ''కుటుంబ బాంధవ్యాలకి, అనురాగాలకి పెద్దపీట వేస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా మెప్పిస్తుంది. కుటుంబ కథే అయినా.. హారర్‌ థ్రిల్లింగ్‌ అంశాల్ని కూడా మేళవించాం. వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రమోద్‌ స్వరాలు ప్రధాన బలం. రాజ‌మండ్రి రైలెక్కి... శివ శివ శంభో శంక‌ర పాట‌ల‌కు ఇప్ప‌టికే అద్భుత స్పంద‌న వ‌చ్చింది. తాజాగా తొలి తొలి ముద్దు పాట శ్రోత‌ల్లోకి అంతే వైర‌ల్ గా దూసుకెళుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. ఈ లిరిక్ యువ‌త‌రాన్ని హ‌త్తుకునే రొమాంటిక్ ప‌ద‌జాలంతో ఆక‌ట్టుకుంటుంది. బాణీ అద్భుతంగా కుదిరింది. హేమ‌చంద‌ర్- సౌమ్య గానం ఆక‌ట్టుకుంటుంది'' అని తెలిపారు.

ఈ చిత్రానికి సంగీతం: ప‌్ర‌మోద్, కెమెరా: చ‌ందు, ఎడిటింగ్: డి.వెంక‌ట్ ప్ర‌భు, ఫైట్స్: న‌ందు, స‌మ‌ర్ప‌ణ‌: బేబి ఢ‌మరి, బ్యాన‌ర్: సుమన్‌ వెంకటాద్రి ప్రొడక్షన్స్, ద‌ర్శ‌క‌నిర్మాత‌: సి.హెచ్ సుమ‌న్ బాబు.

More News

‘విక్రమ్’ ల్యాండర్ జాడపై ఏంటీ కన్ఫూజన్.. కన్ఫూజన్!

ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లో భాగంగా విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపైకి పంపగా..

కమర్షియల్‌ ఎలిమెంట్స్ ఉన్న ల‌వ్‌స్టోరీ `మిస్ మ్యాచ్‌` ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది - హీరో ఉద‌య్ శంక‌ర్‌

'ఆటగదరా శివ' లాంటి డీసెంట్‌ హిట్‌ చిత్రంలో సహజమైన నటనతో ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పు కున్నారు యంగ్‌ హీరో ఉదయ్‌ శంకర్‌.

'బ్యూటిఫుల్' సెన్సార్ పూర్తి

 టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన తాజా చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక).

కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టిన హీరో సందీప్ కిషన్

కథానాయకుడిగా, నిర్మాతగా ఈ ఏడాది సందీప్ కిషన్ మంచి విజయాలు అందుకున్నారు. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం 'నిను వీడని నీడను నేనే'.

దిశ రేప్ వీడియోల కోసం లక్షల మంది గూగుల్‌లో వెతికారు!

వెటర్నరీ డాక్టర్ హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.