మా అమ్మా నాన్న సహా అంతా జైలుకెళ్తారు: పరువు హత్యపై అవంతి

  • IndiaGlitz, [Friday,September 25 2020]

హైదరాబాద్‌లో జరిగిన పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. చందానగర్‌కు చెందిన హేమంత్.. అవంతి అనే యువతిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి గచ్చిబౌలి టీఎన్‌జీవో కాలనీలో యువజంట నివాసముంటోంది. ప్రేమించి పెళ్లి చేసున్న యువ జంటపై యువతి తండ్రి, మేనమామ కక్ష కట్టారు. నిన్న సాయంత్రం 4 గంటలకు హేమంత్ ఇంటికి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు హేమంత్‌, అవంతిలను కిడ్నాప్ చేశారు. అవంతి తప్పించుకుంది. హేమంత్‌ను సంగారెడ్డికి తీసుకెళ్లి దారుణంగా హతమార్చారు.

తమను కిడ్నాప్ చేసినేప్పుడు సాయం కోసం అరిచినా.. అక్కడ చాలా మంది ఉన్నా ఎవరూ స్పందించలేదని అవంతి తెలిపింది. ఫోన్ చేసిన అరగంటకు పోలీస్ వ్యాన్ వచ్చిందని అవంతి వెల్లడించింది. ‘‘మమ్మల్ని కిడ్నాప్‌ చేసినప్పుడు సాయం కోసం అరిచాం. చాలా మంది ఉన్నా ఎవ్వరూ సాయం చేయలేదు. ఫోన్‌ చేసిన అరగంటకు పోలీసు వ్యాన్‌ వచ్చింది. మా మేనమామ యుగంధర్ రెడ్డే నా భర్తను చంపాడు. హేమంత్‌కు ఆస్తులు లేవు. అయినా సంతోషంగా ఉండేవాళ్లం.

ప్రణయ్‌ను చంపించిన మారుతీరావు ఏమయ్యాడు? నా భర్తను చంపిన వారిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పులేదు. మా అమ్మ, నాన్న సహా అందరూ జైలుకెళ్తారు. నా పేరుతో ఉన్న ఆస్తులన్నీ నాన్నకే రాసిచ్చా. మాకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పాం’’ అని వెల్లడించింది. 

More News

హైదరాబాద్‌లో మరో పరువు హత్య

మిర్యాలగూడ పరువు హత్య మరువక ముందే.. హైదరాబాద్‌లో మరో పరువు హత్య జరిగింది. చందానగర్‌కు చెందిన హేమంత్ ఇటీవల ప్రేమ వివాహం చేసుకున్నాడు.

నేడు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకానున్న రకుల్

బాలీవుడ్ డ్రగ్స్ కేసు ఒక్క బాలీవుడ్‌నే కాకుండా టాలీవుడ్‌లోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో స్టార్ హీరోయిన్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ 4: అభికి దూరమవుతున్న మోనాల్.. దగ్గరవుతున్న హారిక

మైండ్ బ్లాక్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. రోబోల చార్జింగ్ అయిపోవడంతో చిన్నగా అవినాష్ వచ్చి అమ్మ రాజశేఖర్ పక్కన కూర్చొని స్మార్ట్‌గా చార్జింగ్ పెట్టుకున్నాడు.

రేపటి నుంచి సిటీ బస్సులు ప్రారంభం

రేపటి నుంచి హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు తిరగనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 180 రోజుల క్రితం సిటీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

మరింత విషమించిన గాన గంధర్వుడి ఆరోగ్యం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి మళ్లీ విషమించింది. ఆగస్ట్ తొలి వారంలో కరోనా బారిన పడిన ఆయన అప్పటి నుంచి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.