close
Choose your channels

"ఏనుగు" చిత్రం చూసిన ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో అరుణ్ విజయ్

Monday, June 13, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్ టైన్మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్,సముద్రఖని, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు, నటీ నటులుగా సింగం సిరీస్ వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బెస్ట్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరి దర్శకత్వంలో సీహెచ్‌ సతీష్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "ఏనుగు". ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేయనున్నారు ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని తాజ్ దక్కన్ హోటల్ లో" ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ ను సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.

ఈ సందర్బంగా...

చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ... ఏనుగు నేను చేస్తున్న 16వ సినిమా. ఇప్పటి వరకు నా సినిమాలను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు మరియు నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కు ధన్యవాదాలు. ఈ ఏనుగు సినిమా కమర్షియల్ , ఎమోషనల్ యాక్షన్ సినిమా. అందరూ ఫ్యామిలీ తో వచ్చి చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఇందులో ప్రస్తుతం సమాజం లో ఉన్న సమస్యలని ఎంటర్టైన్మెంట్ రూపంలో చూపిస్తూ ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది.ఫ్యామిలీ లో ఉన్న ప్రతి ఒక్కరూ సినిమాకు కనెక్ట్ అవుతారు. కాబట్టి ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ... నా కెరీర్లో ఏనుగు బిగ్గెస్ట్ సినిమా తెలుగు తమిళ్ లో ఒకే సారి రిలీజ్ అవుతుంది.హరి సార్ తో వర్క్ చేయడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను. ఇందులో మంచి ఎమోషనల్ కంటెంట్ తో పాటు మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఇందులో చూయించడం జరిగింది.సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కి కనెక్ట్ అవుతారు.జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. గోపీనాథ్ గారు ఎక్సలెంట్ మేకింగ్ ఇచ్చారు.మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... తెలుగు ప్రేక్షకులు ఈఎమోషన్ సినిమాలను బాగా ఇష్టపడతారు. అందుకే మంచి కంటెంట్ తో ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన "ఏనుగు" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఒక నిర్మాతగా కాకుండా ఒక ఆడియన్ గా తమిళ “యానై” సినిమాను తెలుగులో “ఏనుగు” పేరుతో విడుదల చేస్తున్నాను ఏనుగు ఎంత బలమో ఈ సినిమా లో చూస్తారు ఈ సినిమా చూసి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతూ బయటకు వస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాను అన్నారు

నటుడు సముద్రఖని మాట్లాడుతూ.. దర్శకుడు హరి కి ధన్యవాదాలు. ఎందుకంటే మా ఇద్దరిదీ ఒకటే స్కూల్ అయినా హరి దగ్గర్నుంచి ప్రతి రోజు చాలా విషయాలు నేర్చుకుంటుంటాను. ఏనుగు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా హార్ట్ ఫుల్ గా కనెక్ట్ అవుతారు మంచి ఎమోషనల్ తో ఫుల్ ప్యాక్ తో వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుతున్నాను. హీరో,హీరోయిన్ చాలా చక్కగా నటించారు. వారితో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. వీరికి మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నారు.

నటి ప్రియా మాట్లాడుతూ... తెలుగు తమిళ్ లో ఒకే సారి రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే హరి గారి దర్శకత్వంలో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రాధికా మేడం, సముద్ర సర్, జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ ఇలా సీనియర్స్ తో నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా కమర్శియల్ గా సక్సెస్ కావడానికి ఎం కావాలో అన్నీ ఉన్నాయి. ఏనుగు ట్రైలర్ చాలా బాగుంది. ఇందులో యాక్షన్ ఉంది సెంటిమెంట్, ఎమోషన్,కామెడీ ఇలా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. మనం ఏది చేసిన విగ్నేశ్వరుడితో పూజ మొదలుపెడతాము అలాంటిడి ఏనుగు టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది. దర్శకుడు హరి పాన్ ఇండియా దర్శకుడు ఈ మధ్య వచ్చిన అఖండ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు వస్తున్నా ఏనుగు చిత్రం కూడా అఖండ సినిమా అంత గొప్ప విజయం సాదించాలి అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న చిత్ర యూనిట్ సభ్యులు అందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.

నటీనటులు: అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, యోగి బాబు, అమ్ము అభిరామి, KGF రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, ఆడుకలం జయపాలన్, ఇమ్మాన్ అన్నాచ్చి, రాజేష్, ఐశ్వర్య, బోస్ వెంకట్, సంజీవ్, పుగజ్

సాంకేతిక నిపుణులు: కథ, స్క్రీన్‌ప్లే, మాటలు & దర్శకత్వం: హరి, ప్రొడక్షన్ హౌస్: విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్, నిర్మాతలు: సీహెచ్‌ సతీష్‌ కుమార్‌, వేదికకారన్‌పట్టి ఎస్.శక్తివేల్, సంగీతం – జి.వి. ప్రకాష్ కుమార్ DOP – గోపీనాథ్, ఆర్ట్ డైరెక్టర్ – మైఖేల్ B.F.A., ఎడిటర్ – ఆంథోని, సాహిత్యం – స్టంట్స్ – అన్ల్ అరసు, సహ దర్శకుడు: N. జాన్ ఆల్బర్ట్ , కొరియోగ్రఫీ – బాబా బాస్కర్, ధీనా , DI, VFX & సౌండ్ డిజైన్ – నాక్ స్టూడియోస్ సౌండ్ మిక్స్ – టి.ఉదయ కుమార్ , చీఫ్ మేకప్ ఆర్టిస్ట్ – మునియరాజ్ , కాస్ట్యూమర్ – రంగసామి , స్టిల్స్ – శరవణన్ , కాస్ట్యూమ్ డిజైనర్ – నివేదా జోసెఫ్, గీతు , PRO – నాయుడు – ఫణి (బియాండ్ మీడియా)

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.