రాఘవేంద్ర రావు గారి మాటలను ఎప్పటికి మర్చిపోలేను - ఎవ్వరికి చెప్పొద్దు డైరెక్టర్ శంకర్

  • IndiaGlitz, [Tuesday,October 15 2019]

క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాకేశ్‌ వర్రె, గార్గేయి ఎల్లాప్రగడ హీరో హీరోయిన్లుగా బసవ శంకర్‌ దర్శకత్వంలో రాకేశ్‌ వర్రె నిర్మాణంలో రూపొందిన లవ్‌స్టోరీ 'ఎవ్వరికీ చెప్పొద్దు'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర ఫిలింస్‌ పతాకంపై దిల్‌రాజు రిలీజ్ చేసాడు.ఎవ్వరికి చెప్పొద్దు అంటూ సైలెంట్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు అందరికి చెప్పేంత మంచి సినిమాగా ముందుకు దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ శంకర్, హీరోయిన్ గార్గేయి లు మీడియా తో ముచ్చటించారు.

అసలు ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?

క్యాస్ట్ గురించి వస్తున్న సినిమా కాబట్టి స్టోరీ చెప్పగానే నిర్మాతలు కథను, నన్ను నమ్మి ప్రాజెక్టు ని ఓకే చేసేసారు. కానీ సినిమా డిలే అవుతుండటం తో వేరే ఫ్రెండ్ రాకేష్ గురించి చెప్పాడు తాను కూడా ఇలాగే బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడని. అలా రాకేష్ ని కలవడం, సినిమా చేయడం జరిగింది.

రాకేష్ గురించి..

రాకేష్ అందరిలా కాదు. తాను చాలా చాలా ఇంటెలిజెంట్ గా వర్క్ చేస్తాడు. ఏదైనా సినిమా లో క్యారెక్టర్ కోసం చాలా హార్డ్ వర్క్ చేసి.. ఆ క్యారెక్టర్ కి అనుగుణం గా తాను మారి, ఒక చిన్న డెమో లాంటిది రెడీ చేసుకుని అప్పుడు డైరెక్టర్ ని కలుస్తాడు.. అంత మంచి యాక్టర్ రాకేష్.

అసలు మీకు క్యాస్ట్ మీద సినిమా తీయాలని ఎందుకు అనిపించింది? రియల్ లైఫ్ లో క్యాస్ట్ తో ఏమైనా ఇబ్బంది పడ్డారా?

క్యాస్ట్ అనేది సెంట్రల్ సబ్జెక్ట్. కరెక్ట్ గా హేండిల్ చేయగలిగితే మంచి సినిమా అవుతుంది కదా అనిపించింది. నా రియల్ లైఫ్ లో అంటే క్యాస్ట్ వాళ్ళ పెద్దగా ఇబ్బంది పడింది లేదు కానీ ఈ సినిమా కి ఇన్సిపిరేషన్ మాత్రం నా ఫ్రెండ్. తనకి చాలా దారుణంగా బ్రేకప్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాను మళ్ళీ రిలేషన్ జోలికి వెళ్ళలేదు. తన లైఫ్ ని చూసే ఈ సినిమా స్టోరీ రెడీ చేసుకున్నాను.

అసలు మీ సినీ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది..? మీ మొదటి సినిమా ఏంటి ?

మొదటి సినిమా అంటే ఎన్నో ఏళ్ళ కిందటే చేసాను. ఇంకోసారి అనే సినిమా చేశా.. తర్వాత మళ్ళీ కొన్ని రోజులు జాబ్ చేశాను. అసిస్టెంట్ ప్రొఫసర్ గా. తర్వాత బిస్కెట్, రన్ రాజా రన్, పెళ్లి చూపులు సినిమా లకి పని చేశా..

మీ నేటివ్ ప్లేస్..

బేసిక్ గా మా పేరెంట్స్ ది కృష్ణా జిల్లా. కానీ నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ లోనే.

హీరోయిన్ ని ఎలా సెలెక్ట్ చేశారు?

ఆడిషన్స్ లోనే. ఈ రోల్ కోసం దాదాపు 150 మందిని ఆడిషన్ చేసాం. రోజుకి 7 -8 మంది కంటే ఎక్కువ ఆడిషన్ చేసేవాళ్ళం కాదు. అలా అంతమంది లో గార్గేయి ని సెలెక్ట్ చేసాం..

గార్గేయి ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఏం స్పెషల్ ఉంది తనలో?

తనది క్లీన్ జాబ్. ఒక సరైన నటి కానీ, నటుడు కానీ దొరికితే మాత్రమే అది సాధ్యమవుతుంది. తన ఫొటోస్, కెమెరా వైపు చూసే విధానం లోనే తెలిసిపోయింది నాకు గార్గేయి గురించి. అలా తాను సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఇంకో సర్ప్రైజ్. తాను తెలుగు అమ్మాయి అవడం.. అది కూడా మాకు చాలా కలిసొచ్చింది.

ఈ సినిమా కి ఇండస్ట్రీ నుంచి మీకు వచ్చిన బెస్ట్ కంప్లిమెంట్ ఏంటి?

రాఘవేంద్ర రావు గారు ఫోన్ చేసి చాలా మంచి సినిమా చేసావు.. క్యాస్ట్ గురించి ఇలాంటి సినిమా ని తీయగలగడం గొప్ప విషయం అని అభినందించారు.

ఈ సినిమా లో పర్టికులర్ గా ఈ హీరోనే అని అనుకున్నారా?

అదేం లేదండి. కథ మొత్తం రాసుకున్నాక మంచి ఆర్టిస్ట్ దొరికితే చాలు అనుకున్న.లక్కిలీ నాకు రాకేష్ దొరికాడు. తాను మంచి యాక్టరే కాదు, మంచి అందగాడు, తెలివైన వాడు కూడా..

దిల్ రాజు రాకముందు, వచ్చిన తర్వాత ఏమైనా మార్పులొచ్చాయా సినిమా లో?

కొన్ని కొన్ని... దిల్ రాజు గారు మూవీ చుసిన వెంటనే ఇంత లెంగ్త్ వద్దని, ట్రిమ్ చేయమన్నారు. ఈయనకేం తెలుసు ఆయన ప్రొడ్యూసర్.. నా సినిమా నాకే తెలుసుతుంది. డైరెక్టర్ ని నేను అనుకున్నాను.. కానీ ఇవాళ రన్ టైం అనేది సినిమా కి చాలా ప్లస్ అయింది. అంత ఆయన వల్లే..

సినిమా కి ముందు ఇది కాకుండా వేరే టైటిల్స్ ఏమైనా అనుకున్నారా?

అసలు సినిమా టైటిల్ ముందు అనుక్కున్నది అయితే 'ఎవ్వరికి చెప్పొద్దు నా పెళ్లి'. సినిమా చూసిన అందరికి ఎందుకు ఆ టైటిల్ అనుకున్నానో తెలిసే ఉంటుంది.

More News

మీటూ గురించి ప్రియ‌మ‌ణి స్పంద‌న‌

ద‌క్షిణాది సినిమాల్లో న‌టించి హీరోయిన్‌గా త‌న‌కంటూఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న హీరోయిన్ ప్రియ‌మ‌ణి.

'మళ్ళీ మళ్ళీ చూశా' ఒక ఫుల్ మీల్స్‌లా ఉంటుంది - హీరో అనురాగ్‌ కొణిదెన

క్రిషి క్రియేషన్స్‌ పతాకంపై అనురాగ్‌ కొణిదెన హీరోగా హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న చిత్రం ''మళ్ళీ మళ్ళీ చూశా''.

మొదటి సింగిల్ కి ముస్తాబవుతున్న'బ్యూటిఫుల్'

సంచలన దర్శకుడు రామ్ గోపాల్  వర్మ  కొత్త చిత్రం బ్యూటిఫుల్. (ట్రిబ్యూట్ టు రంగీలా ఉప శీర్షిక). నైనా కథానాయికగా,

షారూక్‌తో అట్లీ క‌న్‌ప‌ర్మ్‌?

బాలీవుడ్ సూప‌ర్‌స్టార్స్ ఖాన్ త‌య్రంలో ఒక‌రైన షారూక్‌ఖాన్‌.. త్వ‌ర‌లోనే ఓ సౌతిండియ‌న్ డైరెక్ట‌ర్‌తో

సంక్రాంతి బరిలో వెంకీ మామ?

నిజ జీవితంలో మామా అల్లుడు అయిన వెంక‌టేష్‌, నాగ‌చైత‌న్య అక్కినేని క‌లిసి న‌టిస్తోన్న తాజా చిత్రం `వెంకీమామ‌`.