బొత్సకి రాజకీయ గురువు, మాజీ మంత్రి సాంబశివరాజు కన్నుమూత

  • IndiaGlitz, [Monday,August 10 2020]

రాజకీయ కురువృద్ధుడు, వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు (87) మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువైన సాంబశివరాజు 1958లో సమితి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి ఏకంగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏకైక నాయకుడు. 1989-94లో మంత్రిగా సాంబశివరాజు బాధ్యతలు నిర్వహించారు.1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.

More News

విజయవాడ అగ్ని ప్రమాద ఘటన దిగ్ర్భాంతికి గురి చేసింది: చిరంజీవి

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

వరల్డ్ రికార్డుగా మహేష్ బర్త్‌డే..

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు నేడు. తన బర్త్‌డే ప్రపంచ రికార్డ్‌కు వేదిక అవుతుందని మహేష్ కూడా ఊహించి ఉండడు.

వ్యక్తిగత కారణాల వల్లే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మాధవీలత

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత తన రాజకీయ, సినీ, వ్యక్తిగత విషయాల గురించి ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో

ప్ర‌భాస్‌కు త‌ప్పేలా లేదు!!

ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం త‌గ్గ‌క‌పోయినా ప్ర‌భుత్వాలు కొన్ని విధి విధానాల‌ను ఏర్పాటు చేసి ఆ మేర‌కు షూటింగ్స్ చేసుకోవ‌చ్చున‌ని తెలియ‌జేశారు.

నా గది గోడలనిండా పవన్ ఫోటోలుండేవి: మాధవీలత

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మాధవీలత వీరాభిమాని. ఇంతటి అభిమానిగా మారడానికి గల కారణాలను, అలాగే పవన్ ప్రస్తుతం బీజేపీతో కలిసి పని చేస్తున్నారు.