close
Choose your channels

ఏపీ విభజనకు కారణం వైఎస్ జగనే.. తెరపైకి కొత్త వాదన!?

Tuesday, January 28, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీ విభజనకు కారణం వైఎస్ జగనే.. తెరపైకి కొత్త వాదన!?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ నుంచి తెలంగాణ ఎందుకు విడిపోయిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇదిగో బీకాంలో ఫిజిక్స్ అంటూ అప్పట్లో అందరి నోళ్లలో నానిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మాత్రం తాజాగా కొత్తవాదనను తెరపైకి తెచ్చారు. అదేమిటంటే.. రాష్ట్ర విడిపోవడానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డే కారణమని చెబుతున్నారు. ఇందుకు కారణాలు సైతం చెప్పుకొచ్చారండోయ్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాంతరం వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేశారని.. అందుకే రాష్ట్రం విడిపోయిందని జలీల్ జోస్యం చెప్పారు.
వైఎస్ జగన్‌తో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని భావించిన నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ‌ను ఇచ్చేశారని చెప్పుకొచ్చారు.

‘బాహుబలి’ కంటే!
అంతటితో ఆగని ఆయన.. తాజా రాజకీయ పరిణామాలపై కూడా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడిన ఆయన..
చట్ట సభ లోపల చూస్తే బీపీ పెరుగుతుందని.. బయటకొస్తే పోలీసులు ఉంటున్నారని చెప్పుకొచ్చారు.

అంతేకాదు.. మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ డైరెక్టర్ అయితే ‘బాహుబలి’ కంటే మంచి సినిమా తీయొచ్చని జలీల్ వ్యాఖ్యానించారు.

మనకు పోలికా..!?
జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై జలీల్ స్పందించారు. రెండు రోడ్లు ఉన్న విశాఖలో తాగడానికి నీళ్లు కూడా లేవని..

అలాంటిది రాజధాని వైజాగ్‌లో పెడితే కొత్తగా ఏం అభివృద్ధి వస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వాలు అనుకుంటే అన్నీ అయిపోవని కోర్టులు ఉన్నాయని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భోజనం లేక అడుక్కుతినే సౌతాఫ్రికా మనకు ఆదర్శమేంటి?.. అన్నం లేక పురుగులు తినే దేశంతో మనకు పోలికేంటి..? అని జలీల్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బొత్స గురించి!
ఈ రెడ్ల వెనుక ఎన్నాళ్లు సేవ చేయాలని అప్పట్లో.. ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. బొత్స అవకాశవాదని నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అర్థమయ్యిందన్నారు. కాగా.. విజయవాడ పశ్చిమ నియోజవర్గంలో ఉపఎన్నిక తెచ్చి తన నింర్ణయాలు కరెక్టని వైఎస్ జగన్ నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతటితో ఆగని ఆయన.. ‘అమ్మఒడి’ పథకం గురించి మాట్లాడుతూ.. ఈ పథకం పెట్టడం సంతోషమే..అందరికి ఇవ్వాలన్నారు. అయితే జలీల్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు.. మరీ ముఖ్యంగా బొత్స ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.