close
Choose your channels

ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. మాజీ ఎంపీ జంప్

Tuesday, June 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఏపీలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. మాజీ ఎంపీ జంప్

లోక్‌సభ ఎన్నికల ఫలితాల అనంతరం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. దేశ వ్యాప్తంగా విస్తరించాలని మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘కమలం’ పార్టీ ఏంటో చూపించాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపి పార్టీలోకి వచ్చే నేతలకు డోర్‌లు తెరిచేసింది బీజేపీ. అయితే ఇప్పటికే పలువురు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు బీజేపీ పెద్దలకు టచ్‌లో ఉన్నట్లు వార్తలు వినవచ్చాయి. అంతేకాదు ఈ విషయాన్ని కొందరు టీడీపీ మాజీ నేతలు మీడియా ముందే కుండ బద్ధలు కొట్టారు. అయితే చేరడం కాస్త ఆలస్యం అవ్వొచ్చేమో కానీ.. చేరిక మాత్రం పక్కా అని పుకార్లు వినిపిస్తున్నాయి.

కాషాయం కండువా కప్పుకున్న కొత్తపల్లి..!

ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా మాజీ ఎంపీ, ‘జన జాగృతి’ అధ్యక్షురాలు కొత్తపల్లి గీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో కొత్తపల్లి గీత బీజేపీ కండువా కప్పుకున్నారు. కాగా.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌.. గీతతో మంతనాలు జరిపి దగ్గరుండి అమిత్‌షా వద్దకు తీసుకెళ్లి కండువా కప్పించారు. ఈ సందర్భంగా ఢిల్లీ వేదికగా కొత్తపల్లికి గీతకు కాషాయ కండువా కప్పిన షా.. పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

‘జన జాగృతి’.. బీజేపీలో విలీనం..

కాగా.. 2014 ఎన్నికల్లో అరకు నుంచి వైసీపీ తరఫున ఎంపీగా విజయం సాధించిన గీత.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఈమె కూడా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. అంతేకాదు.. అటు టీడీపీలో కాకుండా ఇటు వైసీపీలో కాకుండా ఆమె తటస్థంగా ఉండిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘జన జాగృతి’ పేరిట రాజకీయ పార్టీని స్థాపించి పెద్ద హంగామానే చేశారమె. తాజాగా రు. తాజాగా తన ‘జన జాగృతి’ పార్టీని బీజేపీలో విలీనం చేసేసి.. కుటుంబ సమేతంగా గీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

సో.. మొత్తానికి చూస్తే బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో స్ట్రాంగ్ అవ్వడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకోవచ్చు. అయితే మున్ముంథు ఇంకెంత కీలక నేతలు, ఉద్ధండులు, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాషాయ కండువా కప్పుకుంటారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే మరి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.