భారత్‌లో తాజాగా 78 వేలకు పైగా కేసులు...

  • IndiaGlitz, [Wednesday,September 02 2020]

భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా 70 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా హెల్త్ బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. నిన్న 78 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 78,357 పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఇలా భారత్‌లో 78 వేల కేసులు ఒకే రోజు వ్యవధిలో నమోదు కావడం నాలుగోసారి కావడం గమనార్హం.

భారత్‌లో ఇప్పటి వరకూ మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 37,62,063కి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1045 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకూ మొత్తంగా 66,460 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 62 వేల మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ 28.99 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 8 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో కరోనా బాధితుల రికవరీ రేటు 77 శాతం ఉండగా.. కరోనా మరణాల రేటు 1.7 శాతంగా ఉంది.