close
Choose your channels

ఉత్కంఠ పెంచుతున్న 'క్రిష్ 4' కథాంశం!

Tuesday, June 29, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఉత్కంఠ పెంచుతున్న క్రిష్ 4 కథాంశం!

ఇండియాలో కూడా సూపర్ హీరో చిత్రాలకు క్రేజ్ వచ్చిందంటే అది హృతిక్ రోషన్ 'క్రిష్' మూవీ వల్లే. ఇండియా మొత్తం క్రిష్ ప్రాంచైజీకి మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా పిల్లలు క్రిష్ సిరీస్ ని చాలా బాగా ఇష్టపడతారు. డిమాండ్ ని దృష్టిలో ఉంచుకునే హృతిక్ రోషన్, ఆయన తండ్రి రాకేష్ రోషన్ క్రిష్ సిరీస్ ని కొనసాగిస్తున్నారు.

రాకేష్ రోషన్ దర్శకత్వంలో క్రిష్ సిరీస్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తండ్రి కొడుకులిద్దరూ క్రిష్ 4కి రెడీ అవుతున్నారు. ఓ భయంకర వైరస్ భారీ నుంచి ఇండియాని క్రిష్ రక్షించే కథా నేపథ్యంతో క్రిష్ 3 తెరకెక్కింది. ఈసారి విభిన్నంగా ప్రయత్నించబోతున్నారట.

ఇదీ చదవండి: ఛత్రపతి రీమేక్ పై ప్రభాస్ రియాక్షన్.. బెల్లంకొండ శ్రీనివాస్ మరో సాహసం

క్రిష్ సిరీస్ కు బీజం పడింది 'కోయీ మిల్ గయా' చిత్రంతో. ఆ చిత్రంలో ఏలియన్ జాదూ ద్వారా హృతిక్ రోషన్ కి కొన్ని శక్తులు సంక్రమిస్తాయి. ఆ జాదూ తిరిగి క్రిష్ 4 లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ విధంగా కథని ప్లాన్ చేస్తున్నారట. ఓ గొప్ప పని కోసం హృతిక్, జాదూతో కలసి టైం ట్రావెల్ చేస్తాడని టాక్.

ఆసక్తి పెంచుతున్న ఈ అంశంతోనే క్రిష్ 4 కథ ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే క్రిష్ 4 మొదలైపోయి ఉండాల్సింది. కానీ పాండమిక్ వల్ల ఆలస్యమైంది. క్రిష్ సిరీస్ లో హృతిక్ కి జోడిగా ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి క్రిష్ 4 లో ఆమెనే రిపీట్ చేస్తారా లేక వేరే హీరోయిన్ ని తీసుకుంటారా అనేది వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.