close
Choose your channels

బీజేపీదే హవా.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్!

Monday, October 21, 2019 • తెలుగు Comments

బీజేపీదే హవా.. తేల్చేసిన ఎగ్జిట్ పోల్స్!

దేశ వ్యాప్తంగా సోమవారం నాడు పలుచోట్ల ఎన్నికలు జరిగిన విషయం విదితమే. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇవాళ ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే సర్వే సంస్థలు గెలుపెవరిదో తేల్చేశాయి. ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుపు సాధిస్తుందన్న విషయమై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.

టైమ్స్ నౌ అంచనాల ప్రకారం :

మహరాష్ట్ర : బీజేపీ కూటమికి 230 స్థానాలు
             కాంగ్రెస్ కూటమికి 48 స్థానాలు
              ఇతరులకు 10 స్థానాలు
హర్యానా: బీజేపీకి 71 స్థానాలు
             కాంగ్రెస్‌కు 11 స్థానాలు

ఇండియా టుడే అంచనాల ప్రకారం :

మహారాష్ట్ర : బీజేపీకి 109 స్థానాలు నుంచి 124 స్థానాలు
              శివసేనకు 57 నుంచి 70
              కాంగ్రెస్‌కు 32 నుంచి 40
              ఎన్సీపీ 40 నుంచి 50
              ఇతరులు 22 నుంచి 30 స్థానాలు 

రిపబ్లిక్ అంచనాల ప్రకారం:

మహారాష్ట్ర : బీజేపీకి 135 నుంచి 142 స్థానాలు
             శివసేనకు 81నుంచి 88 స్థానాలు
             కాంగ్రెస్‌కు 20 నుంచి 24 స్థానాలు
             ఎన్సీపీకి 30 నుంచి 35 స్థానాలు
             ఇతరులు 8 నుంచి 12 స్థానాలు

హర్యానా : బీజేపీకి  52 నుంచి 63 స్థానాలు
             కాంగ్రెస్‌కు 15 నుంచి 19 స్థానాలు
             జేజేపీకి 5 నుంచి 9 స్థానాలు
             ఐఎన్ఎల్ డీ 0 నుంచి 1 స్థానం
             ఇతరులు 7 నుంచి 9 స్థానాలు

అయితే ..పైన చెప్పబడిన సర్వే సంస్థలు ఇప్పటికే పలుమార్లు సర్వేలు చేసి సక్సెస్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ మేరకు నిజమవుతాయో.. అంచనాలు నిజమవుతాయో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz