close
Choose your channels

'ఎక్స్ ప్రెస్ రాజా' మూవీ రివ్యూ

Thursday, January 14, 2016 • తెలుగు Comments
న‌టీన‌టులు - శ‌ర్వానంద్, సుర‌భి,హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, సుప్రీత్‌, ష‌క‌ల‌క శంక‌ర్‌, పోసాని, సూర్య‌, ధ‌న‌రాజ్‌, నాగినీడు త‌దిత‌రులు
సంగీతం - ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు
కెమెరా - కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని
ఎడిటింగ్ - స‌త్య.జి
బ్యాన‌ర్‌- యు.వి.క్రియేష‌న్స్‌
నిర్మాత‌లు - వంశీ, ప్ర‌మోద్‌
ద‌ర్శ‌క‌త్వం - మేర్ల‌పాక గాంధీ

ర‌న్ రాజా ర‌న్‌, మ‌ళ్ళీ మ‌ళ్ళీ ఇది రానిరోజు వంటి రెండు వ‌రుస విజ‌యాలు త‌ర్వాత శ‌ర్వానంద్ న‌టించిన చిత్ర‌మే ఎక్స్‌ప్రెస్ రాజా. వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్ తర్వాత మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం కూడా ఇదే. టోట‌ల్‌గా స‌క్సెస్‌ఫుల్ కాంబినేష‌న్‌తో రూపొందిన ఈ చిత్రం శ‌ర్వానంద్‌కు హ్యాట్రిక్ స‌క్సెస్ తెచ్చిపెడుతుందా లేదా అని తెలియాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.

క‌థ‌

రాజా(శ‌ర్వానంద్‌), అత‌ని మేన‌మామ‌(ప్ర‌భాస్ శ్రీను), గిరి(సప్త‌గిరి) క‌లిసి ఓ కుక్క‌పిల్ల‌ను కిడ్నాప్ చేయ‌డంతో సినిమా మొద‌ల‌వుతుంది. రాజా, అత‌ని మేన‌మామ వైజాగ్‌లో ఏ ప‌ని లేకుండా బేవార్స్‌గా తిరుగుతుంటారు. రాజా తండ్రి ఓ స్కూల్ టీచ‌ర్‌, అత‌ను సూర్య అనే సామాజిక సేవ చేసే వ్య‌క్తితో క‌లిసి గుండె జ‌బ్బుల ఆప‌రేష‌న్ నిమిత్తం 75కోట్లు కూడ‌బెడ‌తారు. ఆ డ‌బ్బును కేశ‌వ‌రెడ్డి(హ‌రీష్ ఉత్త‌మ‌న్‌) ఎన్నిక‌ల కోస‌మ‌ని సూర్య‌ను చంపి కొల్ల‌గొడ‌తాడు. ఆ డ‌బ్బును త‌న అనుచ‌రుడు బ్రిటిష్(సుప్రీత్‌) ద‌గ్గ‌రు ఇస్తాడు. అయితే సుప్రీత్ ఆ డ‌బ్బును ఇన్‌కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయార‌ని అబ‌ద్ధం చెబుతాడు. ఈ క‌థ‌కు స‌మాంత‌రంగా రాజా జాబ్ కోసం హైద‌రాబాద్ వెళ్ళిన‌ప్పుడు అక్క‌డ అమ్ములు(సుర‌భి)ని ప్రేమిస్తాడు. అమ్ములుకు కేశ‌వ‌రెడ్డితో పెళ్ళి నిశ్చ‌య‌మ‌వుతుంది. అప్పుడు రాజా, అమ్ములు ఏం చేస్తారు? అస‌లు ఆ డెబ్బై ఐదు కోట్లు ఏమ‌వుతాయి? కేశ‌వ‌రెడ్డి అమ్ముల‌ను ఎందుకు పెళ్ళి చేసుకోవాల‌నుకుంటాడు? అస‌లు రాజా త‌న మిత్రుల‌తో క‌లిసి కుక్క పిల్ల‌ను ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్

శ‌ర్వానంద్ స‌క్సెస్ మీదున్న జోష్‌తో ఉన్నాడు. ఈ సినిమాలో ఫుల్ ఎన‌ర్జీతో ఉన్న న‌ట‌నను క‌న‌ప‌రిచాడు. త‌న పాత్ర‌కు వంద‌శాతం న్యాయం చేశాడు. లుక్‌లో, క్యారెక్ట‌ర్ ప‌రంగా కొత్త‌ద‌నం కోసం ప్ర‌య‌త్నించాడు. ర‌న్ రాజా ర‌న్ త‌ర‌హా కామెడితో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. సుర‌భి అందంగా క‌న‌ప‌డింది. అయితే న‌ట‌న ప‌రంగా ఓకే. ఊర్వ‌శి నెగిటివ్ రోల్‌తో పాటు వ‌సంత‌కోకిల‌లోని శ్రీదేవి చ‌క్క‌గా న‌టించింది. హ‌రీష్ ఉత్త‌మ‌న్ విల‌న్‌గా చాలా సినిమాల‌ను చేయ‌డం వ‌ల్ల ఈ పాత్ర‌ను సింపుల్‌గానే చేసేశాడు. ప్ర‌భాస్‌శ్రీనుకు చాలా రోజుల త‌ర్వాత మంచి క్యారెక్ట‌ర్ దొరికింది. సినిమా మొత్తం ఉండే ఈ క్యారెక్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. స‌ప్త‌గిరి కామెడి, ష‌క‌ల‌క శంక‌ర్ కామెడి ట్రాక్‌లు ప్రేక్ష‌కుల‌ను న‌వ్విస్తాయి. నాగినీడు, పోసాని, కారుమంచి ర‌ఘు స‌హా మిగిలిన పాత్ర‌లు సినిమాలో త‌మ త‌మ పాత్ర‌ల మేర న‌టించాయి. ద‌ర్శ‌కుడు మేర్ల‌పాక గాంధీ సింపుల్ పాయింట్‌ను న‌డిపించిన తీరు ఆట్టుకుంటుంది. సినిమాలో ఒక స‌న్నివేశాన్ని ప‌లు సంద‌ర్భాల‌కు మిళిత‌మ‌య్యేలా రాసుకున్న స్క్రీన్ ప్లే బావుంది. సినిమాను ఆస‌క్తిక‌రంగా న‌డ‌ప‌డంలో ద‌ర్శ‌కుడు స‌క్సెస్ అయ్యాడు. ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతం బావుంది. అన్నీ పాట‌లు బావున్నాయి. క‌ల‌ర్ ఫుల్ చిల‌క ...సాంగ్, హులాల సాంగ్‌... ముఖ్యంగా ప్రేక్ష‌క‌లకు న‌చ్చుతాయి. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్ర‌ఫీ బావుంది. రీరికార్డింగ్ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

మైన‌స్ పాయింట్స్‌

సినిమాను ఒక స‌న్నివేశం ఆధారంగా అల్లుకోవ‌డంతో ప్రేక్ష‌కుడుకు అక్క‌డ‌క్క‌డా క‌న్‌ఫ్యూజ్ అయ్యే అవ‌కాశం క‌న‌ప‌డుతుంది. విల‌న్ హ‌రీష్ ఉత్త‌మ‌న్ స‌హా క్ల‌యిమాక్స్‌లో అంద‌రూ న‌టించే స‌న్నివేశాలు డ్రాగింగ్‌గా అనిపిస్తాయి. సుర‌భి పాత్ర‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. సినిమా సీరియ‌స్‌గా న‌డుస్తున్న సంద‌ర్భంలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్ట‌డం, ప్రీ క్ల‌యిమాక్స్ సీన్స్ డ్రాగింగ్‌గా అనిపిస్తాయి.

విశ్లేష‌ణ‌

స‌క్సెస్ మీదున్న హీరో శ‌ర్వానంద్‌, ద‌ర్శ‌కుడు మేర్లపాక గాంధీ ఒక మంచి క‌థ‌తోనే సినిమాను చేశారు. స్టార్టింగ్ సీన్‌కు ప్ర‌తి సీన్‌ను లింక్ చేస్తూ ఎక్క‌డా క‌న్ ఫ్యూజ‌న్ లేకుండా, ప్రేక్ష‌కుడిని క‌న్‌ఫ్యూజ‌న్ చేయ‌కుండా ఉండేలా సినిమా ముందుకు న‌డిపారు. కొన్ని కొన్ని డ్రాగింగ్ సీన్స్ మిన‌హా సినిమాను లాజిక్‌గానే చూపించారు. మంచి మ్యూజిక్‌, కెమెరా వంటి టెక్నిక‌ల్ టీం స‌పోర్ట్ కూడా తోడ‌వ‌డంతో ఎక్స్‌ప్రెస్ రాజా ఎంట‌ర్‌టైనింగ్‌గానే సాగుతుంది.

బాట‌మ్ లైన్‌: ఎంట‌ర్ టైనింగ్ 'ఎక్స్‌ప్రెస్ రాజా'

రేటింగ్: 3/5

Get Breaking News Alerts From IndiaGlitz