Traffic Challans: తెలంగాణ వాహనదారులకు శుభవార్త.. పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు..

  • IndiaGlitz, [Wednesday,January 10 2024]

వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. పెండింగ్ చలాన్ల గడువును ఈనెల 31వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 9 లక్షల పెండింగ్ చలాన్లు ఉండగా... నేటి వరకు దాదాపు 1 కోటి 7 లక్షల మంది రాయితీతో కూడిన చలాన్లకు సంబంధించిన చెల్లింపులు జరిగినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటి ద్వారా ఇప్పటివరకు ప్రభుత్వానికి ఇప్పటి వరకు రూ.107 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది. అత్యధికంగా హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 66.57 లక్షల చలాన్లు క్లియర్‌ అయ్యాయని వెల్లడించింది.

కాగా గత నెల డిసెంబర్ 26వ తేదీన పెండింగ్ చలాన్ల రాయితీకి ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి 90 శాతం, టూవీలర్ చలాన్లకు 80 శాతం, ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం రాయితీ ప్రకటించింది. ఇక లారీలతో పాటు ఇతర భారీ వాహనాలకు 50 శాతం రాయితీ ఇచ్చింది. మీసేవతో పాటు యూపీఐ ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవొచ్చని తెలిపింది. ఈరోజు రాత్రితో గడువు ముగియనుంది. అయితే సగంపెండింగ్ చలాన్లు కూడా జమకాకపోవడంతో గడువు పెంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఈనెలాఖరు వరకు గడువు పెంచింది. వాహనదారులు ఈ అవకాశం కచ్చితంగా వినియోగించుకోవాలని కోరింది.

గతేడాది కూడా ఇలా రాయితీ ప్రకటించడంతో వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. 2022 మార్చి 31 నాటికి రాష్ట్రంలో 2.4 కోట్ల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. కేవలం 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకు వసూలయ్యాయి.

More News

Kesineni Nani: చంద్రబాబు పచ్చి మోసగాడు.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు..

టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి మోసగాడు అని విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కేశినేని నాని, ఆయన కుమార్తె సీఎం జగన్‌ను కలిశారు.

BRS MLAs: మధురై కోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రీజన్ ఇదే..

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి తమిళనాడులోని మధురై కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం వీరు కోర్టులో కూర్చుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

YSRCP: వైసీపీకి వరుస షాక్‌లు.. మరో నేత గుడ్ బై!

ఎన్నికల వేళ అధికార వైసీపీకి ఊహించని షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. టికెట్ రాని నేతలతో పాటు పార్టీలో ప్రాధాన్యత దక్కని వారందరూ పార్టీని వీడుతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు

TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న TSPSC చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం

Ambati Rayudu: జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్‌తో భేటీ..

ఏపీ రాజకీయాలు ఏ క్షణం ఎలాంటి మలుపులు తిరుగుతాయో ఊహించడం కష్టమౌతోంది. ఎవరూ ఎప్పుడూ ఏ పార్టీలో చేరతారో అర్థం కావడం లేదు. తాజాగా వైసీపీకి రాజీనామా చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు