‘గరీబ్ కల్యాణ్ యోజన’ను దీపావళి వరకూ పొడిగిస్తున్నాం: మోదీ

కరోనా విషయంలో మరింత అప్రమత్తత వహించాల్సిన సమయంలో మరింత నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. నేడు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా ప్రారంభంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుని లాక్‌డౌన్ పెట్టడంతో చాలా మంది ప్రాణాలు కాపాడినట్టు వెల్లడించారు. మాస్క్, భౌతికదూరం తప్పనిసరి అని పేర్కొన్నారు. గ్రామీణులకైనా, దేశ ప్రధానికైనా ఒకే నిబంధనలుండాలని మోదీ తెలిపారు.

కరోనాతో పోరులో భాగంగా అన్‌లాక్ 2.0లోకి ప్రవేశించామన్నారు. ఈ సమయంలో జలుబు, జ్వరం వంటి రోగాలు చుట్టుముట్టే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లాక్‌డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనంగా గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని దీపావళి వరకూ కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పథకం కింద ఐదు నెలల పాటు 5 కేజీల బియ్యం లేదా గోధుమలు, కిలో చక్కెర అందిస్తామని మోదీ వెల్లడించారు. ఈ పథకం ద్వారా 80 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని పేర్కొన్నారు.

More News

ఏమాత్రం ఊహించని.. షాకింగ్ విషయాన్ని వెల్లడించిన డబ్య్లూహెచ్‌వో

కరోనా ప్రారంభం నుంచి నేటి వరకూ ఏ ఒక్కరూ ఊహించని.. షాకింగ్ విషయాన్ని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

తెలంగాణలో అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా

తెలంగాణ రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్షయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అన్‌లాక్-2 విధివిధానాలను ప్రకటించిన కేంద్రం

లాక్‌డౌన్ సడలింపులను ప్రకటిస్తూ గతంలో ఒకసారి కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది.

శ్యామ్.కె.నాయుడు కేసులో న్యూ ట్విస్ట్.. అదనంగా మరో కేసు..

సినిమాటోగ్రాఫర్ ఛోటా.కె.నాయుడు తమ్ముడు.. శ్యామ్.కె.నాయుడు కేసులో న్యూ ట్విస్ట్ వెలుగు చూసింది.

‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాల రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేసిన రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సీఇఓ షిభాషిస్ స‌ర్కార్‌

రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ కోసం సినీ ప్రేక్ష‌కులు, అభిమానులు ఎంతో ఆతృత‌గా, ఆస‌క్తిగా ఎదురు చూశారు.