తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తున్నాం : కేసీఆర్

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇవాళ 7 గంటల పాటు సుధీర్ఘ కేబినెట్ భేటీ అనంతరం సీఎం మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మే-17తో ముగియనుండటంతో.. దాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించారు. మే-29 వరకు అంటే కేంద్రం ప్రకటించిన దానికంటే ఇంకో 12 రోజుల ఎక్కువగా తెలంగాణలో లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఈ మేరకు కొన్ని సడలింపులతో కూడిన లాక్ డౌన్ మార్గదర్శకాలను కేసీఆర్ వెల్లడించారు.

చాలా సీరియస్‌గా ఉంటుంది..

‘ఇదివరకటిలా కాకుండా ఇకపై రాత్రి పూట చాలా సీరియస్ కర్వ్యూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిల్లోనూ సాయంత్రం ఆరు గంటల వరకే అన్ని పనులు ముగించుకోవాలి. రాత్రి 7గంటల తర్వాత బయట కనిపిస్తే పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 వరకు కర్ఫ్యూ ఉంటుంది. వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది.. ఇంకాస్త ఓపిక పెడితే బయటపడతాం. కేంద్రం మార్గదర్శకాలను యథావిధిగా అమలు చేస్తాం. దయచేసి 65 ఏళ్లు దాటిన వారు బయటికి రాకుండా చూసుకోండి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనే 66 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. గృహ నిర్మాణాలకు సంబంధిత దుకాణాలు తెరుచుకుంటాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వందశాతం పనిచేస్తుంది. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో అన్నిషాపులు తెరుచుకుంటాయి. షాపులు ఉదయం 10 నుంచి సాయంత్రం 6వరకు ఓపెనింగ్స్ ఉంటాయి. సిమెంట్, స్టీల్, ఎలక్ట్రికల్, హార్డ్ వేర్ షాపులకు అనుమితిస్తున్నాం. రెడ్ జోన్లలో మాత్రం ఎలాంటి షాపులు తెరిచేకి అనుమతి లేదు. ఈ నెల 15న మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తాం. రేపట్నుంచి వ్యవసాయ సంబంధిత షాపులకు అనుమతిస్తాం’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్ల లెక్కలివీ...:

రెడ్ జోన్ జిల్లాలు : హైదరాబాద్, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, మేడ్చల్

ఆరెంజ్ జోన్లు జిల్లాలు : సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, మంచిర్యాల, నారాయణపేట్, సిరిసిల్ల, నల్గొండ, నిజామబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగాం, కొమురంభీం ఆసీఫాబాద్, నిర్మల్, గద్వాల్

గ్రీన్ జోన్లు జిల్లాలు : యాదాద్రి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట, ములుగు జిల్లాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ మీడియా ముఖంగా వెల్లడించారు.

More News

ప‌వ‌న్‌తో మ‌ళ్లీ ప‌నిచేయాల‌నుకుంటున్న బాపు బొమ్మ‌

క‌న్న‌డ బ్యూటీ ప్ర‌ణీత సుభాష్ క‌రోనా ప్ర‌భావంతో ఇబ్బందులు ప‌డుతున్న పేద‌వారికి ఆహారాన్ని అందిస్తుంది. ఆహారాన్ని త‌యారు చేసి స్వ‌యంగా ఆమె పేద‌వారికి పంచుతుండ‌టం విశేషం.

డైరెక్ట‌ర్‌కు భూ కేటాయింపులు.. స‌ర్కార్‌కు కోర్టు నోటీసులు

తెలంగాణ ప్ర‌భుత్వం సినీ రంగ అభివృద్ధికి చాలా ప్రాముఖ్య‌త ఇస్తుంది. చాలా సంద‌ర్భాల్లో ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వం బ‌హిరంగంగానే ప్ర‌క‌టించింది కూడా. తెలంగాణ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు

ప్ర‌భాస్ 20లో ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో పూజా హెగ్డే

బాహుబ‌లి త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ నేష‌న‌ల్ రేంజ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సాహో బాలీవుడ్‌, టాలీవుడ్‌లో మంచి క‌లెక్ష‌న్స్‌ను సాధించింది.

మ‌రోసారి ఆమెతోనే జోడీ క‌డుతున్న నితిన్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ చాలా గ్యాప్ తీసుకుని భీష్మ సినిమా చేశాడు. ఈ సినిమా ఈ ఏడాది విడుద‌లై మంచి స‌క్సెస్‌ను సొంతం చేసుకున్నారు.

ఏపీలో మందుబాబులకు మరో భారీ షాక్.. పెరిగిన ధరలు ఇవీ...

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో 3.0 లాక్‌డౌన్‌లో భాగంగా మద్యం అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.