close
Choose your channels

'ఎఫ్ 2' కోసం బ్యాంకాక్‌

Sunday, August 19, 2018 • తెలుగు Comments

`ఎఫ్ 2` కోసం బ్యాంకాక్‌

విక్ట‌రీ వెంక‌టేశ్‌, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మ‌ల్టీస్టార‌ర్ `ఎఫ్‌2`. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్ టైన‌ర్‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి `ఫ‌న్ అండ్ ఫ్ర‌స్ట్రేష‌న్`ట్యాగ్ లైన్‌. ఇందులో వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ తోడ‌ల్లుళ్లుగా కనిపిస్తార‌ట‌.

వెంకీ జోడిగా త‌మ‌న్నా.. వ‌రుణ్ జోడిగా మెహ‌రీన్ న‌టిస్తున్నారు. ఇద్ద‌రూ భార్య‌లు పెట్టే బాధ‌లు భ‌రించ‌లేక బ్యాంకాక్ వెళ‌తార‌ట‌. అక్క‌డ వారికేం ప‌రిస్థితులు ఎదుర‌య్యాయ‌నేదే క‌థాంశం. కాబ‌ట్టి కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం యూనిట్  త్వ‌ర‌లోనే బ్యాంకాక్ వెళుతున్నారు. ప్ర‌ధాన తారాగ‌ణంపై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్నార‌ట‌.