close
Choose your channels

BiggBoss: ఫైమా ఎలిమినేషన్.. చేతిపై ముద్దుపెట్టిన నాగ్, నవ్వుతూ బయటకు

Monday, December 5, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 6 తెలుగులో మరోసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యింది. టాప్ 5లో ఖచ్చితంగా వుంటుందనుకున్న జబర్దస్త్ ఫైమా కన్నీటితో హౌస్‌ను వీడింది. నిజానికి గత వారమే ఆమె ఎలిమినేట్ అవుతుందని అనుకున్నా.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కాపాడింది. కానీ ఈ వీక్ మాత్రం ఫైమా ఎలిమినేషన్‌‌ను తప్పించలేకపోయారు. ఆదివారం సరదాగా అందరినీ ఎంటర్‌టైన్ చేసిన నాగ్.. చివరిలో షాకిచ్చారు.

హిట్ 2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా హీరో అడవి శేష్ స్టేజ్ మీదకు వచ్చాడు. వచ్చీ రాగానే అతనికో కేస్ అప్పగించారు నాగ్. అతడు రావడానికి ముందే కంటెస్టెంట్స్‌లో ఎవరైనా అద్దంపై కోడిబుర్ర అని రాసి దానిపై హారర్ బొమ్మ వేయమని సూచించాడు. ఆ తర్వాత అడివి శేష్‌కు.. ఆ బొమ్మను గీసిన నేరస్తుడెవరో పట్టుకోమని సవాల్ విసిరాడు. కోడిబుర్ర అని తననే అంటున్నారా అని అడివి శేష్ ప్రశ్నించడంతో అంతా నవ్వేశారు. అనంతరం అది రాసింది ఎవరో కనిపెట్టే పనిలో పడ్డాడు. రైటింగ్‌ను బట్టి చూస్తే అమ్మాయిలు రాసినట్లు లేదని, అలాగే రాసిన హైట్‌ను బట్టి చూస్తే మీడియం హైట్ వున్నవాళ్లు రాసి వుండొచ్చని అభిప్రాయపడ్డాడు. తర్వాత హీరోయిన్ మీనాక్షీ చౌదరి కూడా వేదిక మీదకు వచ్చి సందడి చేసింది.

తర్వాత నాగార్జున ఇంటి సభ్యులు ఒక్కొక్కరిని పిలిచి హౌస్‌ నుంచి బయటకు వెళ్లాక లైఫ్ లాంగ్ ఫ్రెండ్‌షిప్ ఎవరితో చేస్తారు..? ఫ్రెండ్‌షిప్ ఇక్కడే కట్ చేసుకునేది ఎవరితో అనేది చెప్పాల్సిందిగా కోరాడు. దీనికి ఎవరెవరు ఏం చెప్పారంటే..?

ఆదిరెడ్డి : ఫైమాతో లైఫ్‌ లాంగ్ ఫ్రెండ్‌షిప్, ఇనయాతో హౌస్‌లో వరకే ఫ్రెండ్‌షిప్
ఇనయా : కీర్తితో లైఫ్ లాంగ్ ఫ్రెండ్‌షిప్, శ్రీహాన్‌తో హౌస్‌లో వరకే ఫ్రెండ్‌షిప్
శ్రీహాన్ : రేవంత్‌తో లైఫ్ లాంగ్ ఫ్రెండ్‌షిప్, ఆదిరెడ్డితో హౌస్‌లో వరకే ఫ్రెండ్‌షిప్
రోహిత్ : రేవంత్‌తో లైఫ్ లాంగ్ ఫ్రెండ్‌షిప్, ఫైమాతో హౌస్‌లో వరకే ఫ్రెండ్‌షిప్
ఫైమా : ఆదిరెడ్డితో లైఫ్ లాంగ్ ఫ్రెండ్‌షిప్, రోహిత్‌తో హౌస్‌లో వరకే ఫ్రెండ్‌షిప్
కీర్తి భట్ : ఇనయాతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్‌షిప్, శ్రీహాన్‌తో హౌస్‌లో వరకే ఫ్రెండ్‌షిప్
రేవంత్ : శ్రీసత్యతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్‌షిప్, కీర్తితో హౌస్‌లో వరకే ఫ్రెండ్‌షిప్
శ్రీసత్య : రేవంత్‌తో లైఫ్ లాంగ్ ఫ్రెండ్‌షిప్, రోహిత్‌తో హౌస్‌లో వరకే ఫ్రెండ్‌షిప్

అనంతరం నామినేషన్స్‌లో వున్న ఒక్కొక్కరిని నాగార్జున సేవ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. శనివారం రోహిత్, కీర్తిలను నాగ్ సేవ్ చేశారు. ఈ రోజు శ్రీసత్య, రేవంత్‌లను సేవ్ చేశారు. చివరికి ఆదిరెడ్డి , ఫైమా మాత్రమే మిగిలారు. దీంతో వీరిద్దరిని రెండూ క్లౌడ్స్ కింద నిలబెట్టి.. ఎవరిపై ఎరుపు రంగు పువ్వులు పడతాయో వారు ఎలిమినేట్ అవుతారని చెప్పారు. ఫైమాపై రెడ్ ఫ్లవర్స్ పడటంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా షాక్‌కు గురయ్యారు. లగేజ్‌తో గేట్ల వద్దకు వెళ్తూ... ఆదిరెడ్డికి ప్రతిరోజూ ఉదయం ఒక గుడ్డు ఇవ్వండి అని తోటి కంటెస్టెంట్స్‌కు చెప్పడంతో ఆదిరెడ్డి ఎమోషనల్ అయ్యాడు. పాపం ఆ పిల్ల తనను ఎంతగా గుర్తు పెట్టుకుందో అంటూ కంటతడి పెట్టాడు.

తర్వాత వేదిక మీదకు వచ్చిన ఫైమాకు తన జర్నీని చూపించారు నాగ్. ఆపై హౌస్‌లో ఫర్ ఎవరు, ఫస్ట్రేషన్ ఎవరో చెప్పాలని ఫైమాకు టాస్క్ ఇచ్చారు నాగార్జున . ఈ సందర్భంగా ఆమె ఎదుట ఒక బోర్డ్ పెట్టి.. హౌస్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్స్‌ ఫోటోలను ఫైమా చేతిలో పెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ తప్ప అందరి ఫోటోలను ఫన్ కేటగిరీలో వేసి, అతనొక్కడినే ఫ్రస్టేషన్ కేటగిరీలో వుంచింది. దీనికి రేవంత్ స్పందిస్తూ ‘‘మార్చుకుంటాను లే ’’ అని అన్నాడు. ఇంకెప్పుడు అంటూ నాగ్ నవ్వేశారు. అయితే రేవంత్ గేమ్‌లో వున్నప్పుడే ఫ్రస్ట్రేట్ అవుతాడని, స్వతహాగా చాలా మంచివాడని ఫైమా చెప్పింది.

ఇక ఫైమా హౌస్‌ను వీడుతుందనగా రేవంత్ ఒక మాట అన్నాడు. ఆమె చేతి మీద ఎవ్వరినీ ముద్దు పెట్టనివ్వదని చెప్పాడు. అలా చేస్తే ఫైమాకు చక్కిలిగింత అని అంటాడు. ఔనా .. అని నాగ్ , ఫైమా చేయి అందుకుని ముద్దు పెట్టుకున్నాడు. సిగ్గు పడుతూనే చేయి ఇచ్చిన ఫైమా, మధ్యలో వెనక్కి లాగేందుకు ట్రై చేసింది. దీంతో ఆమె ఏడుపు మాయమై నవ్వుతూ బిగ్‌బాస్ హౌస్‌ను వీడింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.