ఎంతకు తెగించార్రా.. ఏకంగా సుప్రీంకోర్ట్ పేరుతో ఫేక్ వెబ్‌సైట్, సీజేఐ జాగ్రత్తలు

  • IndiaGlitz, [Thursday,August 31 2023]

కాదేది కవితకు అనర్హం అన్నట్లుగా దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులు , ప్రముఖులు, వ్యక్తులు, బ్రాండ్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. రకరకాల మార్గాల్లో విలువైన డేటాను సేకరిస్తున్న కేటుగాళ్లు.. కోట్లాది రూపాయలను దోచేస్తున్నారు. ఈసారి ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టునే నేరగాళ్లు టార్గెట్ చేశారు. సుప్రీంకోర్టు పేరిట ఓ నకిలీ వెబ్‌సైట్ రూపొందించారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ వెల్లడించారు. అంతేకాదు.. ఆ ఫేక్ వెబ్‌సైట్ విషయంలో జాగ్రత్తగా వుండాలని న్యాయవాదులు, ప్రజలను ఆయన హెచ్చరించారు . దీనిపై సుప్రీంకోర్ట్ రిజిస్ట్రీ సైతం పబ్లిక్ నోటీస్ జారీ చేసింది.

సుప్రీంకోర్ట్ నోటీసులో ఏముందంటే :

సర్వోన్నత న్యాయస్థానం పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ను కేటుగాళ్లు రూపొందించారు. రెండు యూఆర్ఎల్‌లను కూడా డెవలప్‌ చేశారు. వీటి సాయంతో వ్యక్తిగత వివరాలు, రహస్య సమాచారాన్ని సేకరిస్తున్నారు. వీటిని ఎవరూ షేర్ చేయొద్దు.. ఎలాంటి రహస్య సమాచారాన్ని పంచుకోవద్దు. సుప్రీంకోర్ట్ రిజిస్ట్రీ ఎప్పుడూ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, రహస్య వివరాలు, ఆర్ధిక లావాదేవీల గురించి అడగదు అని రిజిస్ట్రీ పేర్కొంది.

ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటీ :

సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా WWW.SCI.GOV.IN డొమైన్‌తో రిజిస్టర్ అయి వుంది. దీని పేరుతో ఏదైనా నకిలీ యూఆర్ఎల్ గనుక వస్తే దానిని క్లిక్ చేసే ముందు ఒరిజినల్ డొమైన్‌తో సరిచూసుకోండి. ఏదైనా సైబర్ దాడికి గురైనట్లుగా అనుమానమొస్తే.. వెంటనే మీ ఆన్‌లైన్ ఖాతాలు, బ్యాంక్ ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని సుప్రీంకోర్ట్ రిజిస్ట్రీ సూచనలు చేసింది. ఈ నకిలీ వెబ్‌సైట్ గురించి దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించామని వెల్లడించింది.

More News

కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా .. రేపటికి వాయిదా

దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వారికి వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

తండ్రీకొడుకులు పాదం మోపారు.. వరుణుడు పారిపోయాడు, సెంటిమెంట్ దెబ్బకు జనం గగ్గోలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరు గుర్తుచేసుకుంటే.. ఆయన హైటెక్ పాలనతో పాటు వర్షాలు కూడా గుర్తొస్తాయి. దురదృష్టమో, శాపమో తెలియదు గానీ చంద్రబాబు రాష్ట్ర పగ్గాలు

రాష్ట్రంలో వర్షాభావ పరిస్ధితులు .. ఆ రెండు పాదాల మహిమే : ఎంపీ అవినాష్ రెడ్డి సెటైర్లు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్ధితులు నెలకొన్నాయి. ఆగస్ట్ పోయి సెప్టెంబర్ వస్తున్నా నేటికి సరైన వర్షాలు లేవు. ఎల్ నినో ప్రభావం కారణంగా సెప్టెంబర్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని

CM YS Jagan:జగన్‌పై అభిమానం చాటుకున్న విద్యార్ధులు.. రాఖీ ఆకారంలో ముఖ్యమంత్రిపై మమకారం

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య బంధానికి, ప్రేమానురాగాలకు ప్రతిరూపంగా చెప్పుకునే రక్షాబంధన్ పర్వదినాన్ని భారతీయులు ఘనంగా జరుపుకుంటున్నారు.

Allu Arjun:అభిమానులకు బిగ్‌ సర్‌ప్రైజ్ ఇచ్చిన బన్నీ.. 'పుష్ప 2' లొకేషన్ పంచుకున్న ఐకాన్ స్టార్

జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న తొలి తెలుగు నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.