ఏపీలో ఫ్యామిలీ పాలిటిక్స్‌కు ఇక సెలవు!

  • IndiaGlitz, [Saturday,May 25 2019]

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ పాలిటిక్స్‌కు ఫుల్‌స్టాప్ పడింది. కొన్ని తరాలు పాటు రాజకీయాల్లో కాకలు తీరిన నేతలు 2019 ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయారు. తమకు అడ్డు లేదు.. తాము చెప్పిందే వేదం.. మేం చెప్పినట్లే చేసి తీరాలి ఈ కుటుంబాలు నియోజకవర్గాలను, జిల్లాలను కంట్రోల్‌లో పెట్టుకుని ఓ ఆట ఆడించేవారు.

అలాంటి వారందరూ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయారు. బహుశా ఇక దెబ్బకు ఇక కోలుకుని మళ్లీ పోటీ చేయాలన్నా సాహసించరేమో. ఇదిలా ఉంటే కొన్ని కొన్ని చోట్ల ఇక మనమెందుకులే అని వారి వారసులను రంగంలోకి దింపారు. ఫస్ట్ టైమ్ రంగంలోకి దింపగా వారంతా ఫ్యాన్‌ గాలికి తట్టుకోలేక వెనుదిరిగారు.

ఫ్యాన్‌ గాలికి కొట్టుకుపోయిన కుటుంబాలివే..!

రెడ్డప్పగారి ఫ్యామిలీ (రాయచోటి, లక్కిరెడ్డి పల్లె), జేసీ ఫ్యామిలీ (అనంతపురం), పరిటాల ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ, కోట్లా ఫ్యామిలీ, కేఈ ఫ్యామిలీ, టీజీ ఫ్యామిలీ, అశోక్ గజపతిరాజు ఫ్యామిలీ, దేవినేని ఫ్యామిలీ, వంగవీటి ఫ్యామిలీ, మాగంటి ఫ్యామిలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాతాడంత లిస్ట్ ఉండనే ఉంది. ఈ కుటుంబాలన్నీ ఒకప్పుడు ఆయా నియోజకవర్గాల్లో.. జిల్లా్ల్లో ఓ వెలుగు వెలిగిన వారే.. మరికొందరు 2019 ఎన్నికల్లో తమ వారసులను రంగంలోకి దింపి ప్లాప్ అయ్యారు.

గెలిచిందెవరు..?

శ్రీకాకుళం టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు వరుసగా రెండోసారి విజయం సాధించారు. మరోవైపు.. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు కూడా ఈ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేశాడు. శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి రెండోసారి పోటీ చేసిన ఈయన వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై 6,653 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

More News

శాసనసభా పక్షనేతగా వైఎస్ జగన్.. టార్గెట్ 2024

వైసీపీ అధినేత, త్వరలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. కొత్తగా ఎన్నికైన పార్టీ ఎమ్మెల్యేలు తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌

'అభినేత్రి 2' ట్రైల‌ర్ విడుద‌ల ... మే 31న గ్రాండ్ రిలీజ్‌

ప్ర‌భుదేవా, త‌మ‌న్నా జంట‌గా, నందితాశ్వేత‌, సోనూసూద్‌, స‌ప్త‌రిగి, కోవై స‌ర‌ళ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `అభినేత్రి 2`.

30 ఏళ్లు జగనే సీఎం.. కమెడియన్లే నేడు కింగ్‌లు!

ఆంధ్రప్రదేశ్‌కు రానున్న ముప్పై ఏళ్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని..

వైఎస్ జగన్ కేబినెట్‌లోని మంత్రులు వీళ్లే...!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మే-30న నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

ఇండియాలో రికార్డ్ బ్రేక్ చేసిన వైసీపీ ఎంపీ

రాజకీయాల్లో సరిగ్గా ఓనమాలు కూడా రాని వయస్సులో ఎంట్రీ ఇచ్చి.. కనివినీ ఎరుగని రీతిలో ఫ్యాన్ హవాతో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి ఇండియాలోనే రికార్డు సృష్టించారు.