ప్ర‌ముఖ కెమెరామెన్ క‌న్న‌మూత‌...

  • IndiaGlitz, [Friday,November 10 2017]

సూర్య, హ‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన సింగం సిరీస్ సినిమాల‌కు సూర్య‌, హ‌రిల‌కు ఎంత మంచి పేరొచ్చిందో..సినిమాటోగ్రాఫ‌ర్ ప్రియ‌న్‌కి కూడా అంతే మంచి పేరు వ‌చ్చింది. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ప‌నిచేసిన ఈ స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ గుండెపోటుతో చెన్నైలో క‌న్నుమూశారు.

1995లో కె.ఎస్‌.అధియామ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన 'తొట్టా చినుంగి' అనే సినిమాతో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌రిచ‌య‌మైయ్యారు. హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ప్రియ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు 13 సినిమాల‌కు ప‌నిచేశారు.

ప్ర‌స్తుతం విక్ర‌మ్ హీరోగా హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌తోన్న చిత్రం 'స్వామి స్క్వేర్' సినిమాకు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు ప్రియ‌న్. ఈయ‌న మ‌ర‌ణం ప‌ట్ల సినీ ఇండ‌స్ట్రీ విచారం వ్య‌క్తం చేసింది.

More News

'లండన్ బాబులు' షూటింగ్ పూర్తి

ఎప్పటిక‌ప్పుడు మంచి కాన్సెప్ట్ ల‌తో లిమిటెడ్ బ‌డ్జెట్ లో క్వాలిటిగా చిత్రాల‌ను నిర్మిస్తున్న మారుతి టాకీస్ బ్యాన‌ర్ పై నిర్మించిన చిత్రం లండ‌న్ బాబులు.

'జవాన్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌ వివరాలు

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా , బివిఎస్ రవి దర్శకత్వం చేసిన చిత్రం జవాన్. ఈ చిత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

పెళ్లి పీట‌లెక్క‌నున్నన‌మిత‌..

బొద్దుగుమ్మ న‌మిత త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోనుంది. త‌మిళ న‌టుడు వీర అలియాస్ వీర బాహుని ఈ న‌వంబ‌ర్ 24న తిరుప‌తిలో ఈ అమ్మ‌డు పెళ్లి చేసుకోనుంది.

విష్ణు మంచు 'ఆచారి అమెరికా యాత్ర' చిత్ర ఫస్ట్ లుక్

విష్ణు జన్మదినం సందర్భంగా నవంబర్ 23 న విడుదల కానుంది. శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రాన్ని చాలా వరకు అమెరికా, మలేషియా మరియు హైదరాబాద్ లలో చిత్రీకరించారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుగుతుంది. 

'అజ్ఞాత‌వాసి' పాట‌లు అప్పుడేనా?

'అజ్ఞాత‌వాసి' పాట‌లు గురించి ఈ మ‌ధ్య చ‌ర్చ ఎక్కువ‌గా సాగుతోంది. బైట‌కొచ్చి చూస్తే అనే సింగిల్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి 'అజ్ఞాత‌వాసి' పాట‌ల మీద ఆసక్తి ఎక్కువైంది.