హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రముఖ క్రీడాకారుడు మృతి

  • IndiaGlitz, [Monday,January 27 2020]

అమెరికా బాస్కెట్ బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ (41)హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన మృతితో క్రీడాలోకం విషాదంలో మునిగిపోయింది. పూర్తి వివరాల్లోకెళితే.. కొబ్ బ్రయంట్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఇవాళ క్రష్ అయింది. లాస్ ఏంజిల్స్‌కు అతి సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోబ్ మృతిపట్ల ఎన్బీఏ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు. హెలికాప్టర్ లోని మృతదేహాలన్నీ గుర్తుపట్టని విధంగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఆయన కూతురు సహా తొమ్మిది మంది తుదిశ్వాస విడిచారు. అమెరికన్ బాస్కెట్ బాల్ అసోసియేషన్-ఎన్బీఏ ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్లలో ఒకరిగా కోబ్ గుర్తింపు తెచ్చుకున్నారు. 20 సంవత్సరాలకు పైగా క్రీడాభిమానులను అలరించిన ఘనత కోబ్‌ది. అంతేకాదు.. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్‌లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణపతకాలు అందుకున్నారు.

ట్రంప్ స్పందన..!

ఇదిలా ఉంటే.. కోబ్ దుర్మరణంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. మరోవైపు బ్రియాంట్ మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ తెలిపారు. ఈ వార్త వినడం దురదృష్టకరమని.. కోబ్ ఆత్మకు శాంతి చేకూరాలని కొహ్లీ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

కేటీఆర్ సంతాపం!

ఇదిలా ఉంటే.. బ్రియాంట్ మృతిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. ‘బ్రియాంట్‌, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు’ అని ట్వీట్ చేశారు.

More News

విజయ్ ‘మాస్టర్’ లుక్ కాపీ కొట్టేశారుగా!?

ఇదిగో ఈ పక్కనుండే ఫొటోను కాస్త నిశితంగా గమనించండి.. రెండింట్లో ఏమైనా తేడా కనిపించిందా..?

పవన్ కల్యాణ్‌పై హీరో షాకింగ్ కామెంట్స్!!

టాలీవుడ్ టాప్ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై హీరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో అసలేం జరుగుతోంది..?

ర‌జినీ 168 టైటిల్‌..!!

ద‌ర్బార్ సినిమా త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. వెంట‌నే డైరెక్ట‌ర్ శివ‌తో సినిమాను స్టార్ట్ చేశాడు.

రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో బాల‌కృష్ణ‌

కొన్ని కాంబినేష‌న్స్‌పై సినీ ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో భారీ అంచ‌నాలుంటాయి. అలాంటి క్రేజీ కాంబినేష‌న్స్‌లో బాల‌కృష్ణ‌,

'మాస్ట‌ర్' రిలీజ్ డేట్‌.. ప్లాన్ అదే!

కోలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మాస్ట‌ర్‌`.