తల్లి కాబోతున్న ప్రముఖ గాయని..

  • IndiaGlitz, [Thursday,March 04 2021]

ప్రముఖ గాయని తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా స్వయంగా వెల్లడించింది. సింగర్ శ్రేయా ఘోషల్ తాను పెళ్లికాబోతున్నానంటూ శుభవార్త చెప్పింది. 'బేబీ శ్రేయాదిత్య కమింగ్' అంటూ సోషల్ మీడియా ద్వారా శ్రేయ తను తల్లి కాబోతోన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంది. తమ జీవితంలోకి బేబి శ్రేయాదిత్య రాబోతోందంటూ శ్రేయా తెలిపింది. అందరి దీవెనలూ కోరుతూ బేబి బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది.

‘‘బేబి శ్రేయాదిత్య రాబోతోంది. శైలాదిత్య, నేను ఈ వార్తను మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషస్తున్నాం. మా జీవితంలో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న ఈ శుభ సందర్భంలో మీ అందరి ప్రేమ, దీవెనలు కావాలి’’ అని శ్రేయ ట్వీట్ చేసింది. శ్రేయా ఘోషల్ తన మిత్రుడు శైలాదిత్యను 2015లో వివాహం చేసుకుంది. పలు భారతీయ భాషల్లో శ్రేయ పాటలు పాడి మధుర గాయనిగా పేరు తెచ్చుకుంది. ఆమె ప్రతిభకు అవార్డులు, రివార్డులు తార్కాణంగా నిలిచాయి

More News

మొన్న ఘట్కేసర్.. నిన్న విజయనగరం.. ఎందుకిలా?

మొన్న ఘట్కేసర్.. నిన్న విజయనగరం జిల్లా గుర్ల.. ప్రాంతం ఏదైతేనేమి తెలుగు రాష్ట్రాల్లో వరుస ఘటనలు తల్లిదండ్రులను భయాందోళనకు గురి చేస్తున్నాయి.

మహిళను పొదల్లోకి ఈడ్చుకెళ్లి హత్యాయత్నం.. వారే లేకుంటే...

ఓ వ్యక్తి.. ఒక మహిళను ఈడ్చుకుంటూ పొదల్లోకి తీసుకెళ్లాడు. ఆమె గొంతు నులిమి హత్య చేసేందుకు యత్నిస్తుండగా..

‘ఆర్ఆర్ఆర్’.. రికార్డ్ స్థాయిలో అమ్ముడైన డిజిటల్ హక్కులు!

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.

‘వి’ చిత్రాన్ని తొలగించండి: బాంబే హైకోర్టు

నేచురల్ స్టార్ నాని నటించిన ‘వి’ మూవీ దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్‌లో విడుదలైన విషయం తెలిసిందే.

‘అరణ్య’ ట్రైలర్: ఏనుగుల ఇంట్లో మనుషుల అరాచకం

రానా దగ్గుబాటి చేస్తోన్న మరో ప్రయోగం అరణ్య (హిందీలో హాథీ మేరీ సాథీ, తమిళ్‌లో కాదన్) . బాహుబలిలో భళ్లాల దేవుడిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రానా..