బాలయ్య కోసం అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్

  • IndiaGlitz, [Tuesday,October 04 2016]

నంద‌మూరి బాల‌కృష్ణ 100వ సినిమా 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రం కోసం ఎంతో అతృత‌గా ఎదురుచూస్తున్న నంద‌మూరి అభిమానులు అంతే ఉత్సాహంతో బాలకృష్ణ సినిమా కోసం ఘనమైన వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా ప్రొద్దుటూరులో బాలకృష్ణ నటించిన 'లెజెండ్' చిత్రం 900 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడుతోన్న అర్చన థియేటర్ లో రేపటి నుండి( అక్టోబర్ 5) జ‌న‌వ‌రి 11 వ‌ర‌కు నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన 99 సినిమాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు.

మ‌రే హీరో సినిమాల‌కు లేని విధంగా బాల‌కృష్ణ అభిమానులు 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రానికి ఇలా స్వాగ‌తం ప‌లక‌డం తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఇదే ప్ర‌థ‌మం. ఈ అరుదైన విషయం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోనుంది. నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ న‌టించిన 100 సినిమా కోసం ఎంత ఎగ్జ‌యిట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నార‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.

More News

నేను క్షత్రియ, త్రివిక్రమ్ బ్రాహ్మిణ్ , రామోజీరావు గారు చౌదరి....అందుచేత నేను కులాల గురించి పట్టించుకోను - సునీల్

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి...తననటనతో అందర్నీ కడుపుబ్బా నవ్వించి...ఆతర్వాత కథానాయకుడుగా మారి విజయాలు సాధిస్తున్న కమెడియన్ టర్నడ్ హీరో సునీల్.

మీలో ఎవరు కోటీశ్వరుడు రిజిస్ట్రేషన్ స్టార్ట్..!

మీలో ఎవరు కోటీశ్వరుడు నాలుగవ సీజన్ కు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాత గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.

'గౌతమిపుత్ర శాతకర్ణి ' ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ డేట్ ఖరారు

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి.బ్యానర్పై నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో

విలన్ గా మారుతున్న కమెడియన్ టర్నడ్ హీరో..!

విలన్ గా మారుతున్న కమెడియన్ టర్నడ్ హీరో...ఎవరో కాదు సునీల్.అవును..ఇది నిజంగా నిజం.ఈ విషయాన్ని ఈరోజు స్వయంగా సునీల్ మీడియాకి తెలియచేసారు.

చక్కనమ్మా చిక్కినా అందమే...

తెలుగు,తమిళంలో బబ్లీ బ్యూటీ హన్సిక వరుస సినిమాలతో బిజీగా ఉంది.