‘బంగార్రాజు’ స్పెషల్ సాంగ్‌లో ఫరియా అబ్దుల్లా

  • IndiaGlitz, [Tuesday,December 14 2021]

కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను వేగ‌వంతం చేశారు. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో ఇది వరకే విడుదల చేసిన లడ్డుండా, నా కోసం పాటలకు విశేషమైన స్పందన లభించింది. ఇక ఇప్పుడు పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ మూడో పాటతో అలరిచేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే ఈ మూడో రాబోతోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 17న సాంగ్ టీజర్ కూడా రాబోతోంది. జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఈ స్పెషల్ సాంగ్‌లో నాగార్జున, నాగ చైతన్యల సరసన స్టెప్పులు వేశారు.

మొదటి సారిగా మ్యూజిక్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ పోస్టర్‌ ద్వారా సాంగ్ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చేశారు. ఇక ఇందులో అక్కినేని తండ్రీ కొడుకులిద్దరూ ఫరియా అబ్దుల్లాతో కలిసి చిందులు వేయనున్నారు. నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండగా.. నాగ చైతన్య మోడ్రన్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇక ఫరియా మాత్రం ఆటంబాంబ్‌లో కనిపిస్తున్నారు.

అక్కినేని కుటుంబానికి చిరకాలం గుర్తుండిపోయే సినిమా మనం. అందులో నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించారు. మళ్లీ ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సినిమాకు ప్రీక్వెల్‌గా రాబోతోన్న ఈ ‘బంగార్రాజు’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సత్యానంద్ స్క్రీన్ ప్లేను అందిస్తుండగా.. సినిమాటోగ్రఫర్‌గా యువరాజ్ పని చేస్తున్నారు.

నటీనటులు : అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజి, వెన్నెల కిషోర్, ఝాన్సీ

More News

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. చేతులెత్తేసిన కాంగ్రెస్, బీజేపీ

తెలంగాణలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది.

పీవీ నరసింహరావుపై వెబ్ సిరీస్.. తెరకెక్కించనున్న ప్రకాశ్ ఝా, ఆహాలో స్ట్రీమింగ్

తెలుగు జాతి సత్తాను , సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వర్గీయ పీవీ నరసింహారావు.

బిగ్‌బాస్ 5 తెలుగు: హౌస్‌లో స్వీట్ మెమొరీస్.. ఆ సర్‌ప్రైజ్‌కి శ్రీరామ్, మానస్ ఎమోషనల్

బిగ్‌బాస్ 5 తెలుగు 100వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.

ఆగ్రహంతో ఊగిపోయిన బన్నీ ఫ్యాన్స్.. నాగార్జున్ ‘‘ఎన్‌ కన్వెన్షన్‌’’పై దాడి, లాఠీఛార్జ్

భారతదేశంలో సినీతారలకు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అభిమాన తారల్ని దైవంలా ఆరాధిస్తారు  ఫ్యాన్స్.

కరీనా, అమృతా అరోరాలకు కోవిడ్ .. వరుసపెట్టి పార్టీలకీ, బాలీవుడ్ స్టార్స్‌లో ఆందోళన

కోవిడ్ ముప్పు తగ్గింది అనేలోపు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో కలకలం రేపుతోంది.