prathyusha garimella : ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య.. ఫేమస్ సెలబ్రెటీలు ఆమె కస్టమర్లే

  • IndiaGlitz, [Saturday,June 11 2022]

ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ల అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించారు. బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్నారు ప్రత్యూష. ఈ నేపథ్యంలో ఇంట్లోని స్నానాల గదిలో ఆమె మృతదేహం పడి ఉంది. పక్కనే కార్బన్‌ మోనాక్సైడ్‌ సీసాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాత్‌రూమ్‌లో కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. ప్రత్యుష మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లలో ఒకరిగా ప్రత్యూష గుర్తింపు తెచ్చుకున్నారు. పలువురు సీని, క్రీడా ప్రముఖులకు ఫ్యాషన్‌ డిజైనర్‌గా ప్రత్యూష పనిచేశారు. శృతి హాసన్, దీపికా పదుకొణే, రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత, ఛార్మి, త్రిష, నిహారిక,కృతి శెట్టి నటీమణులకు ఆమె దుస్తులు డిజైన్ చేశారు.

More News

Natti Kumar - RGV : వివాదానికి తెర .. దోస్త్ మేరా దోస్త్ అంటోన్న రామ్‌గోపాల్ వర్మ - నట్టి కుమార్

మొన్నామధ్య సినీ నిర్మాత నట్టి కుమార్, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మధ్య నడిచిన వివాదం అంతా ఇంతా కాదు.

Nagarjuna : 1000 నందుల బలాన్ని గుప్పిట పట్టి.. ‘‘బ్రహ్మాస్త్ర’’లో ఇంట్రెస్టింగ్‌‌గా నాగ్ రోల్

ప్రస్తుతం పాన్ ఇండియా కల్చర్ కారణంగా దక్షిణాది నటులు బాలీవుడ్‌లో.. హిందీ నటులు సౌత్‌లో సినిమాలు చేస్తున్నారు.

nadendla manohar: ప్రభుత్వానికి వ్యతిరేకంగా 73 శాతం మంది... వైసీపీ ఇక ఇంటికే : నాదెండ్ల మనోహర్

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.

Pawan Kalyan : రాష్ట్రవ్యాప్తంగా పవన్ బస్సు యాత్ర.. తిరుపతి నుంచే ఆరంభం, ఆరు నెలలు ప్రజల్లోనే

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తప్పవని ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు సిద్ధమయ్యారు.

Janasena party : వూరికో జనసేన లాయర్‌ .. కేసులకు భయపడొద్దు: శ్రేణులకు నాదెండ్ల భరోసా

పోలీసులను వెంటబెట్టుకుని గడప గడపకు తిరిగితే ప్రజా సమస్యలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.