రేవంత్ విజయాన్ని అడ్డుకున్న ఫైమా... కెప్టెన్సీ ఛాన్స్ మళ్లీ మిస్

  • IndiaGlitz, [Wednesday,September 14 2022]

బిగ్‌బాస్ 6 సీజన్ ప్రజలకు కావాల్సినంత వినోదాన్ని పంచుతోంది. గతంలో నాలుగైదు వారాలు గడిచిన తర్వాత షో ట్రాక్ ఎక్కేది. కానీ ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ అలకల్ని, గొడవల్ని చాలా వేగంగా పెట్టుకుంటూ వుండటంతో ప్రేక్షకులు కూడా తమకు కావాల్సింది ఇదే అన్నట్లుగా టీవీలకు అతుక్కుపోతున్నారు. సోమవారం నామినేషన్ కార్యక్రమం రసాభాసగా జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా గీతూ, రేవంత్‌లు నువ్వా నేనా అన్నట్లు సాగింది. నామినేషన్స్‌లో రాజ్‌ శేఖర్‌, షాని, అభినయ శ్రీ, రోహిత్‌, మరీనా, ఆదిరెడ్డి, గీతూ రాయల్‌, రేవంత్‌, ఫైమా నామినేట్‌ అయ్యారు.

మంగళవారం ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే ఇంటి సభ్యులకు కెప్టెన్సీ ‘‘సిసింద్రీ’టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో ప్రతి ఇంటి సభ్యునికి ఒక బొమ్మను ఇస్తారు. దానిని వారు తమ సొంత బిడ్డలాగా చూసుకోవాలి. ఏడ్చి తమకు ఏం కావాలో చెబుతాయి ఆ బొమ్మలు. ఆ పనులను ఇంటి సభ్యులు చేసి పెట్టాలి. ఎవరైతే బేబీని నిర్లక్ష్యం చేస్తారో, పాపని మరోకరు లభించేలా చేస్తారో వారం కెప్టెన్సీ కంటెండర్‌ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది.

సెకండ్ టాస్క్‌గా ‘‘సాక్స్ అండ్ షేప్స్ ’’ ఇచ్చారు బిగ్‌బాస్. ఇందులో గోనె సంచులను తొడుక్కుని, గెంతుకుంటూ వెళ్లి ప్లస్, మైనస్ వంటి గుర్తులను అమర్చి వెనక్కి రావాలి. బజర్‌ మోగినప్పుడు గార్డెన్‌ ఏరియాలో ఉన్న ఐదు బేబీ చైర్‌లో బేబీని పెట్టిన వారు నెక్ట్స్ కెప్టెన్సీ టాస్క్ కి ఎంపికవుతారు. ఫైమా, రేవంత్‌, చంటి, కీర్తి, ఆరోహి గోనె సంచులు తొడుక్కుని బాక్సెస్‌ ఫిల్‌ చేసే పోటీలో పాల్గొనగా, చంటి గెలుస్తాడు. అయితే తాను గెలిచే సమయంలో ఫైమా అడ్డుపడటం వల్లే చంటి గెలిచాడని రేవంత్ ఆరోపిస్తూ.. కోపం ప్రదర్శిస్తాడు. ఓకరిని ఓడించాలని చూస్తే మనమే ఓడిపోతామంటూ ఫైమాను ఉద్దేశించి అంటాడు. చంటికి కంగ్రాట్స్ చెబుతూ.. తానే రియల్ ఫైటర్‌ని అంటాడు.

ఇక అసలే సీపీఐ నారాయణ వంటి వారు బిగ్‌బాస్‌ని బ్రోతల్ హౌస్ అంటున్న వేళ.. మెరీనా , రోహిత్‌లు ఆయనకు మరో అవకాశం ఇచ్చారు. పొద్దు పొద్దున్నే లేవగానే ముద్దుల్లో మునిగిపోయారు. నాగార్జున ఫుల్ రైట్స్ ఇచ్చారనో, బిగ్‌బాస్ వాళ్లు చెప్పారో కానీ తాము ఎక్కడ వున్నామనే విచక్షణ మరిచి ఏకంగా కెమెరాల ముందే రొమాన్స్ చేస్తూ కనిపించారు. భర్తను కంట్రోల్ చేయాల్సిన మెరీనానే మరింత కవ్వించడం ఇక్కడ కొసమెరుపు. వీళ్ల ముద్దు ముచ్చట్లు చూసిన నేహా చౌదరి.. మీరిద్దరిని చూస్తుంటే తనకు పెళ్లి చేసుకోవాలని వుందంటూ కామెంట్ చేసింది.

అయితే ఎందుకో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ రేవంత్‌ని టార్గెట్ చేయడం కెప్టెన్సీ టాస్క్‌లోనూ కనిపించింది. ఇప్పటి వరకు గీతూ మాత్రమే రేవంత్‌ను టార్గెట్ చేయగా.. ఆ వారం ఫైమా కూడా ఈ లిస్ట్‌లోకి చేరింది. తన బేబీని తన వద్ద నుంచి మరొకరు తీసుకోవడంతో కెప్టెన్సీ పోటీదారుగా రేవంత్ తప్పుకోవాల్సి వచ్చింది. మరి దీనిపై ఎన్ని గొడవలు జరుగుతాయో, ఫైమాను కూడా రేవంత్ ఇకపై టార్గెట్ చేస్తాడో లేదో తెలియాలంటే రాబోయే ఎపిసోడ్స్ వరకు ఆగాల్సిందే.

More News

Nagashaurya: నాగశౌర్య ‘కృష్ణ వ్రింద విహారి' టీమ్ పాదయాత్ర

వెర్సటైల్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై

Shree Karthik: 'ఒకే ఒక జీవితం' విజయం.. నా బరువుని దించేసింది : దర్శకుడు శ్రీకార్తిక్

యంగ్ అండ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ 30వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఒకే ఒక జీవితం.

విజయ్‌ దేవరకొండపై దుష్ప్రచారం.. ఎదుగుతున్న హీరోని తొక్కాలనుకోవడం సహజమే : ఆర్జీవీ సంచలనం

విజయ్ దేవరకొండ... స్వయంకృషితో, తనదైన నటనతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ ఎదిగిన హీరో .

BiggBoss: ఈ వారం నామినేషన్‌లో ఎనిమిది మంది.. అందరి టార్గెట్ ‘గీతూ’నే

బిగ్‌బాస్ 6 తొలివారమే వేడి పుట్టించింది. గలాటా గీతూ, రేవంత్, మెరీనా- రోహిత్‌ల పర్మార్మెన్స్‌కి తోడు సీపీఐ జాతీయ నేత నారాయణ వ్యాఖ్యలతో

Ruby Hotel Secunderabad : సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి,

సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.