డైరెక్ట‌ర్‌ని ఆకాశానికేత్తెస్తున్న ‘ఫిదా’ బ్యూటీ..!

  • IndiaGlitz, [Tuesday,December 22 2020]

తెలుగులో వరుణ్ తేజ్ ‘ఫిదా’తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన త‌మిళ బ్యూటీ సాయిప‌ల్ల‌వి .. ఇప్పుడు రానాతో ‘విరాట‌ప‌ర్వం’లో న‌టిస్తోంది. మ‌రో వైపు నాగ‌చైత‌న్య‌తో ఈమె జోడీ క‌ట్టిన ‘ల‌వ్ స్టోరి’ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సంద‌ర్భంగా సాయిప‌ల్ల‌వి రీసెంట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌ను పొగ‌డ్త‌ల‌తో ముంచేసింది. తాను ఇప్పుడు జీవితాల‌ను చూసే విధానం మార‌డానికి శేఖ‌ర్ క‌మ్ముల‌గారే కార‌ణం. నాకు జీవితంలో ఎలా పోరాడాలో నేర్పారు. జీవితంలో ఎలాంటి క్లిష్ట‌ప‌రిస్థితునైనా ఎదుర్కొనేంత‌గా ధైర్యాన్ని ఇచ్చార‌ని అంది సాయిప‌ల్ల‌వి. రీసెంట్‌గా ‘పావ‌క‌థైగ‌ల్’ అనే అంథాల‌జీలో న‌టించిన సాయిప‌ల్ల‌వి ఇప్పుడు త్వ‌ర‌లోనే ‘ల‌వ్‌స్టోరి’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇది కాకుండా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్’ సినిమాలోనూ హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని అంటున్నారు. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందబోయే వేదాళం సినిమా రీమేక్‌లోనూ చిరంజీవి చెల్లెలు పాత్రలో సాయిపల్లవి నటిస్తుందని వార్తలు మెండుగా వినిపిస్తున్నాయి.

More News

ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు క‌రోనా పాజిటివ్‌

నువ్వు సెల‌బ్రిటీవి అయితే నాకేంటి?  ఇక్క‌డ క‌రోనా వైర‌స్ .. అంటూ ఈ చైనా వైర‌స్ ఉధృతి పెంచుకుంటూనే ఉంది కానీ..

యూకే నుంచి చెన్నై వచ్చిన వ్యక్తికి కరోనా.. అప్రమత్తమైన అధికారులు..

కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోందని కాస్త ఫ్రీ అయిపోయిన జనాలకు కొత్తరకం వైరస్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

ప్రపంచాన్ని వణికిస్తున్న స్ట్రెయిన్ వైరస్.. ప్రమాదం స్థాయెంత?

ఇటీవలి కాలంలో ఎక్కువగా కనిపించిన టైటిల్స్.. ‘ప్రపంచమా ఊపిరి తీసుకో.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది’ అని.

ఓ భక్తురాలు చేసిన పనికి.. ఆలయ అధికారులు షాక్..

ఓ భక్తురాలు చేసిన పనికి జీడికల్ శ్రీరామచంద్ర స్వామి వారి ఆలయ అధికారులు షాక్ అయ్యారు. ఏకంగా తన ఇంటినే స్వామివారికి సదరు భక్తురాలు రాసిచ్చేసింది.

బాలీవుడ్ స్టార్‌తో విజ‌య్ సేతుప‌తి వెబ్‌సిరీస్‌..!

కోలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి గురించి మన తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు.