సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పిన ఫిల్మ్ ఛాంబర్!

  • IndiaGlitz, [Wednesday,July 21 2021]

చాలా రోజుల తర్వాత మళ్ళీ థియేటర్లు కళకళలాడబోతున్నాయి. జూలై 30 నుంచి తెలంగాణాలో థియేటర్లు పునః ప్రారంభించేందుకు థియేటర్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు పార్కింగ్ ఫీజుల నేపథ్యంలో వెసులుబాట్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2018లో పార్కింగ్ ఫీజులు రద్దు చేస్తూ జీవో 63 విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే థియేటర్లు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఆ జీవోని ప్రభుత్వం సవరిస్తూ ఉత్తర్వలు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదేశాల ద్వారా సింగిల్ స్క్రీన్ థియేటర్లు పార్కింగ్ ఫీజు వసూలు చేసే వెసులుబాటు కల్పించింది.

ఇది కేవలం సింగిల్ స్క్రీన్ లకు మాత్రమే. మల్టిఫ్లెక్సుల్లో పార్కింగ్ ఫీజులు వసూలు చేయకూడదు. దీనితో సింగిల్ స్క్రీన్ యాజమాన్యాలు, ఎగ్జిబిటర్లు తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పార్కింగ్ ఫీజు వసూలు చేసే వెసులుబాటు కల్పించాలని ఇటీవల ఎగ్జిబిటర్లు సీఎం కేసీఆర్ కు అభ్యర్థించారు.

తమ అభ్యర్థనని అంగీకరించిన కేసీఆర్, కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని లకు ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పటికే కరోనా వల్ల థియేటర్ల పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతుండడంతో జూలై 30 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరుచుకోనున్నాయి.

More News

ముఖానికి ముసుగు, న్యూడ్ గా కనిపించమన్నాడు.. రాజ్ కుంద్రా రాసలీలలు

పోర్న్ ఫిలిమ్స్ మేకింగ్ కేసులో శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా రాసలీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

పదేళ్లకో హిట్, ఆస్కార్.. రెహమాన్ ఎవరు.. కాలి గోటితో సమానం

నందమూరి నటసింహం బాలకృష్ణ మరో వివాదంలో కేంద్ర బిందువుగా మారారు.

అప్పుడే ఆయన ప్రేమలో పడ్డా, కొంతమందికి తెలుసు: హీరోయిన్

ఫెయిర్ అండ్ లవ్లీ బ్యూటీ యామి గౌతమ్ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో పెద్దగా సక్సెస్ కానప్పటికీ యామి గౌతమ్ కి క్రేజ్ ఉంది.

అందరి నోట ఒక్కటే మాట.. వెంకటేష్ అదుర్స్.. సమంత ఫిదా!

విక్టరీ వెంకటేష్ సినిమా అంటే దర్శకులకు సగం పని పూర్తయినట్లే. ఏ సన్నివేశంలో ఎలాంటి హావభావాలు పండించాలో వెంకటేష్ చూసుకుంటాడు.

ఎన్టీఆర్ తప్పించుకోవడానికే, చరణ్ లుక్ పై నో కామెంట్.. ఆఫ్రికా అడవుల్లో మహేష్

రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ మరోసారి ఆర్ఆర్ఆర్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.