Editor Gowtham Raju: ఎడిటర్ గౌతంరాజు కన్నుమూత.. శోక సంద్రంలో తెలుగు చిత్ర పరిశ్రమ

  • IndiaGlitz, [Wednesday,July 06 2022]

టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు కన్నుమూశారు. ఆయన వయసు 68 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతంరాజు మంగళవారం అర్ధరాత్రి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. గౌతంరాజు కన్నుమూశారని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

ఆపరేటివ్ కెమెరామెన్‌గా ప్రస్థానం:

1954 జనవరి 15న ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు గౌతంరాజు. ఆయన తల్లిదండ్రులు రంగయ్య, కోదనాయకి. ఈ క్రమంలో గౌతంరాజు కుటుంబం మద్రాస్ కి షిఫ్ట్ కావడంతో.. అక్కడి అరుణాచలం థియేటర్‌లో ఆపరేటివ్ కెమెరామన్ గా కెరీర్ ప్రారంభంచారు. ఎడిటర్, డైరెక్టర్ సంజీవి దగ్గర ఎన్నో మెళకువలు నేర్చుకున్నారు. తమిళ చిత్రం ‘అవళ్ ఓరు పచ్చికొళందై’తో ఎడిటర్ గా మారారు. చిరంజీవి నటించిన చట్టానికి కళ్లు లేవు చిత్రానికి గాను తెలుగులో తొలిసారి పనిచేశారు. అనంతరం దర్శకుడు జంధ్యాలతో సాన్నిహిత్యం కారణంగా ఆయన దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలకు గౌతంరాజే ఎడిటర్ గా పనిచేశారు. నాలుగు దశాబ్ధాల సుదీర్ఘ ప్రస్థానంలో దాదాపు 800 పైచిలుకు సినిమాలకు ఎడిటర్ గా పనిచేసి టాలీవుడ్ లో అగ్రశ్రేణి ఎడిటర్ గా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఆరు సార్లు నంది అవార్డులతో సత్కరించింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళం, హిందీ చిత్రాలకు కూడా గౌతంరాజు పనిచేశారు.

More News

Gudipudi Srihari : పాత్రికేయ దిగ్గజం గుడిపూడి శ్రీహరి కన్నుమూత.. ఆయన రివ్యూలు గీటురాయిలా వుండేవి : పవన్ దిగ్భ్రాంతి

సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి మృతిపై జనసేన అధినేత, సినీనటుడు పవన్‌కల్యాణ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Janasena Party : ఏపీకి వైసీపీ హానికరం.. ముద్దులు పెట్టేవాళ్లని నమ్మొద్దు : జనవాణిలో పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాటలను పాలకులు గుర్తుంచుకోవాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

RK Roja : మోడీ సభలో సందడంతా ఆమెదే : ప్రధాని , సీఎం, చిరంజీవితో సెల్ఫీ తీసుకున్న రోజా.. ఫోటోలు వైరల్

మన్యం వీరుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఘనంగా జరిగాయి.

Janasena Party : దోచుకోవడం , దాచుకోవడం.. ఎదురు తిరిగితే బ్లాక్‌మెయిలింగ్ : వైసీపీ పాలనపై పవన్ విమర్శలు

జనవాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీల్లో ఎక్కువగా వ్యవసాయం , గృహ నిర్మాణం , విద్య మీదే వచ్చాయన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Janasena Party : ‘‘ముద్దుల మావయ్య’’నంటూ వంచన.. పిల్లలు చనిపోతున్నా పట్టదా : జగన్‌పై పవన్ ఆగ్రహం

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ లకు సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.