close
Choose your channels

కరోనా వైరస్‌పై సినిమా.. తొలి టైటిల్ ఏంటో తెలుసా?

Monday, March 16, 2020 • తెలుగు Comments

సినిమా వాళ్లు సినిమా వాళ్లే.. ఓ విష‌యాన్ని సినిమా కోణంలో ఆలోచిస్తుంటారు. తాజాగా ప్ర‌పంచాన్ని క‌రోనా వైర‌స్ భ‌య‌పెడుతుంది. క‌రోనా దెబ్బ‌కు స్టాక్ మార్కెట్లే కాదు.. సినిమా ప‌రిశ్ర‌మ కూడా ఇబ్బంది ప‌డుతుంది. ఇబ్బందులు ప‌డుతున్నా స‌రే! అదే టైటిల్‌తో సినిమాలు తీయాల‌ని సినిమా మేకర్స్ ఆలోచిస్తున్నారు. క‌రోనా అనే వ‌చ్చేలా టైటిల్స్‌ను రిజిష్ట‌ర్ చేయించుకుంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ ముందుగా ‘క‌రోనా ప్యార్ హై’ అనే టైటిల్‌ను రిజిష్ట‌ర్ చేయించుకుంది. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప‌నులు కూడా మొద‌లెట్టేశార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డిన త‌ర్వాత ఈ సినిమాను ప్రారంభిస్తామ‌ని స‌ద‌రు నిర్మాణ సంస్థ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.

ఇండియ‌న్ సినిమాపై క‌రోనా వైర‌స్ పెద్ద ప్ర‌భావాన్నే చూపుతుంది. స్టార్ హీరోల సినిమాల‌న్నీ వాయిదా ప‌డుతున్నాయి. ఇక టాలీవుడ్‌లోనూ అదే ప‌రిస్థితి. ప్ర‌భుత్వం సినిమా థియేట‌ర్స్ , పాఠ‌శాల‌ల‌ను బంద్ చేయాల‌ని సూచించడంతో ఈ నెల 31 వ‌ర‌కు కరోనా ప్ర‌భావం బ‌లంగా ప‌డింది. ఉగాదికి రావాల్సిన‌ సినిమాల‌న్నీ వాయిదా ప‌డ్డాయి. సినిమా బిజినెస్‌, క‌లెక్ష‌న్స్‌పై ఈ సినిమా చూపిన ప్ర‌భావం ఎప్ప‌టి వ‌ర‌కు కొన‌సాగ‌తుందో వేచి చూడాలి.

Get Breaking News Alerts From IndiaGlitz