రేస్ టు ఫినాలే స్టార్ట్..

  • IndiaGlitz, [Saturday,November 28 2020]

‘ఓ బేబీ’ టైటిల్ సాంగ్‌తో షో స్టార్ట్ అయింది. మోనాల్ యోగాసనం వేసింది. నేనూ చేస్తా.. నాకేమైనా తక్కువా అని అవినాష్ వచ్చాడు. మన కటౌట్‌కి అది అవసరమా అంటూ అరియానా ఫన్ చేసింది. ఇక అవినాష్ వల్ల కాకపోతే సోహల్ వచ్చి చేయించాడు. అవినాష్ గొడవ గొడవ చేశాడు. నువ్వు నాకు ఎప్పుడు హెల్పింగ్‌గా ఉన్నావు? తొక్కలో తినిపించుడు తప్ప అని అరియానా.. అవినాష్‌ని అనడంతో అవినాష్, సొహైల్ కలిసి ఫన్ చేశారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో మీ ఆట తీరు అత్యంత నిరాశజనకంగా ఉందని చెప్పారు. ఈ టాస్క్ చేయడానికి అభి నిరాకరించిన కారణంగా వరస్ట్ పెర్ఫార్మర్‌గా బిగ్‌బాస్ ప్రకటించారు. లగ్జరీ బడ్జెట్ టాస్క్.. అభికి రాదని బిగ్‌బాస్ చెప్పారు. ఇక మీదట టాస్కుల్లో తెలివిగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. మోనాల్‌ను నేను ఏడిపించాననడం తీసుకోలేకపోయానని కాబట్టి చేయలేకపోయానని బిగ్‌బాస్‌కి అభి వివరణ ఇచ్చాడు. అవినాష్.. అందరం సరిగా ఆడలేదు అనవద్దని చెప్పాడు. అరియానా కూడా తాను బాగానే ఆడానని చెప్పుకుంది. అభి, సొహైల్, హారిక స్ట్రెస్ గురించి కాసేపు డిస్కస్ చేశారు.

ఇక రేస్ టు ఫినాలే మొదలైందని.. ఇప్పటి నుంచి బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్ ఉండరని బిగ్‌బాస్ చెప్పారు. ఇంటి సభ్యులందరూ తమ బాధ్యతను ఎవరు సక్రమంగా నిర్వహించారనే దానిపై చర్చించి.. మాజీ కెప్టెన్స్ నుంచి ఒక బెస్ట్ కెప్టెన్‌ను.. వరస్ట్ కెప్టెన్‌ను ఎన్నుకుని కెప్టెన్సీ బ్యాండ్‌కి వీడ్కోలు చెప్పాలని బిగ్‌బాస్ చెప్పారు. ఇక మాజీ కెప్టెన్స్ అంతా తమ కెప్టెన్సీలో ఏమేం చేశారో చెప్పుకొచ్చారు. బెస్ట్ కెప్టెన్‌గా హారికను ఎంపిక చేశారు. వరస్ట్ కెప్టెన్‌గా అవినాష్.. అఖిల్ పేరు చెప్పాడు. ఈ క్రమంలో అవినాష్‌కి, అఖిల్‌కి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అభి కూడా అఖిల్ పేరు చెప్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. ఫైనల్‌గా వరస్ట్ కెప్టెన్‌గా అరియానాను ఎంచుకున్నారు. తరువాత కెప్టెన్సీ బ్యాండ్‌కి హౌస్‌మేట్స్ వీడ్కోలు పలికిన తీరు చాలా బాగా అనిపించింది. అరియానాను వరస్ట్ కెప్టెన్‌గా ఎంచుకున్నందుకు చాలా ఫీల్ అయింది. అభి వెళ్లి నేనసలు కెప్టెనే అవలేదు. నాకంటే నువ్వు బెటర్ అని అరియానాకు చెప్పాడు. హారిక బెస్ట్ కాదని.. నేను ఒప్పుకోనని మోనాల్ అఖిల్, సొహైల్‌లకు చెప్పింది. ఛీ అంటూ మోనాల్ అనడంతో సొహైల్ బాగా ఫీల్ అయ్యాడు. మోనాల్ వచ్చి పక్కన కూర్చోగానే సొహైల్ బాగా ఫీలయ్యాడు. మోనాల్ హగ్ చేసుకుని కన్విన్స్ చేయడానికి ట్రై చేసింది. భాష రాకపోవడం ఇక్కడ మోనాల్ తప్పిదంగా అనిపించింది.

ది ఆల్ న్యూ ఐ20 టాస్క్. ఒక్కొక్కరుగా కారు దగ్గర ఫోటోలకు ఫోజులిచ్చారు. అవినాష్.. మోనాల్ పక్కన కూర్చొని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేశాడు. పక్కనే ఉన్న అఖిల్ కామెంట్స్ చేస్తూ ఎంజాయ్ చేశాడు. తరువాత బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ తీసుకున్న ఫోటోలను ప్లే చేశారు. హారిక, అవినాష్‌లను బెస్ట్ జంటగా అఖిల్ ఎంపిక చేశాడు. సొహైల్, అఖిల్ కూర్చొని మాట్లాడుతుంటే ఎప్పుడూ కూర్చొని మాట్లాడటమేనా? రండి అని పిలవడంతో ఇద్దరూ కలిసి అవినాష్‌ను ఆడుకున్నారు. అరియానా పడుకుంటే అవినాష్ వెళ్లి ఏదో కోపంలో పోనీ అన్నానని సారీ చెప్పాడు. మొత్తానికి ప్రోమో చూపించినంత సీన్ అయితే లేదు.. పెద్దగా గొడవలేమీ లేకుండానే ఫన్నీ వేలోనే నేటి షో నడిచింది.

More News

ఇక తెలంగాణలో టీఆర్ఎస్ పని అయిపోయింది: జేపీ నడ్డా

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ఎన్టీఆర్ స‌ర‌స‌న మ‌హేశ్ హీరోయిన్‌?

టాలీవుడ్‌లో ఎవ‌రైనా స్టార్ హీరో సినిమా మొద‌లైందంటే.. ఆ హీరో స‌ర‌స‌న న‌టించ‌బోయే జోడీ ఎవ‌రా అనే ఆస‌క్తి అంద‌రిలోనూ క్రియేట్ అవుతుంది.

'మేక సూరి 2' మూవీ రివ్యూ

కోవిడ్ పుణ్య‌మాని డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఒరిజిన‌ల్స్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అలా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఒరిజిన‌ల్స్‌లో ‘మేక‌సూరి’ ఒక‌టి.

మోహ‌న్‌లాల్‌ను ఫాలో అవుతున్న మెగాస్టార్‌..!

మెగాస్టార్ చిరంజీవి .. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్‌ను ఫాలో అవుతున్నారంటూ ఓ వార్తొక‌టి సోష‌‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

మేము ఒకవైపు చెమటోస్తుంటే.. కీర్తి నిద్ర పోతోంది: నితిన్ కంప్లైంట్

కొన్నిసార్లు సరదాగా చేసిన పనులు బాగా క్లిక్ అవుతాయి. ఇక అవే సెలబ్రిటీలు చేస్తే ఆ కిక్కే వేరప్పా..