కరోనా నేపథ్యంలో దేశ ప్రజలకు నిర్మలమ్మ శుభవార్త!

కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆ వైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి దేశ ప్రజలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. క్యాష్ విత్‌డ్రాలపై ఆంక్షలను సడలిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ఇకపై ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదును విత్‌డ్రా చేసినా ఎటువంటి చార్జీలు ఉండబోవని నిర్మలమ్మ స్పష్టంగా ప్రకటించారు. మూడు నెలల వరకూ ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా నగదు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆమె ఉగాది ముందు తియ్యటి శుభవార్త తెలిపారు. అంతేకాదు.. బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ పరిమితిని కూడా ఎత్తేస్తున్నట్లు ప్రకటించారు.

అన్నీ గడువులు.. తగ్గింపులే..!

‘కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికే లాక్ డౌన్ చేస్తున్నాం. ఆధార్-పాన్ అనుసంధానం గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. ఆర్థిక ప్యాకేజీపై కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది. ఆర్థిక సంవత్సరం చివరిరోజులు కావడంతో వేగంగా స్పందించాల్సి ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరం ఐటీ రిటర్న్‌ల దాఖలుకు 2020 జూన్ 30 గడువిస్తున్నాం. ఈ వ్యవధిలో పన్ను చెల్లింపుల ఆలస్య రుసుం 12 నుంచి 9 శాతానికి తగ్గిస్తున్నాం. టీడీఎస్ జమలో ఆలస్య రుసుం 18 నుంచి 9 శాతానికి తగ్గించాలని నిర్ణయించాం. అంతేకాదు.. వివాద్ పే విశ్వాస్ పథకం గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. పన్ను వివాదం మొత్తాల చెల్లింపుల్లో 10 శాతం అదనపు రుసుం తొలగిస్తున్నాం. మార్చి, ఏప్రిల్, మే మాసాల జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు గడువు జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. కాంపోజిషన్ స్కీమ్ రిటర్న్‌ల దాఖలుకు కూడా జూన్ 30 వరకు గడువు పెంచాం. ఎగుమతులు, దిగుమతులకు ఊరట కలిగిస్తూ, కస్టమ్స్ క్లియరెన్స్‌ను జూన్ 30 వరకూ నిత్యావసర సర్వీసుగా పరిగణిస్తాం’ అని మీడియా ముఖంగా నిర్మలమ్మ ప్రకటించారు.

More News

కరోనాపై యుద్ధం.. విరాళాలు ప్రకటిస్తున్న ప్రముఖులు

కరోనా వైరస్ ప్రపంచాన్ని కాటేస్తున్న నేపథ్యంలో పలువురు ప్రముఖులు సాయం చేసి పెద్ద మనసు చాటుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ చేయడం.. మరోవైపు ప్రజా రవాణా బంద్ చేసిన సంగతి తెలిసిందే.

భారత్‌‌లో కరోనా పరిస్థితి ఎలా ఉందంటే..

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారీన పడి వేలాది మంది చనిపోగా.. లక్షలాది మంది అనుమానితులుగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

దిల్‌రాజుకి టెన్ష‌న్... మాటిచ్చిన పవన్ కళ్యాణ్

దిల్‌రాజు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుంది. క‌రోనా వైర‌స్‌తో ఎంటైర్ ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ స్తంభించింది. థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. అయితే ఈ క‌రోనా ఎఫెక్ట్ దిల్‌రాజుపై

ఏపీలో అన్ని బార్డర్లు మూసివేత.. రాకపోకలు బంద్

తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వాలు ప్రకటించిన విషయం విదితమే. మరోవైపు లాక్‌డౌన్‌ను పకడ్బందిగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు, సీఎస్‌లకు

కరోనా ఎఫెక్ట్.. ఏపీలో 'పది' పరీక్షలు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న పదో తరగతి పరీక్షలపై కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం విదితమే. కాగా.. ఈ క్రమంలో మార్చి 31 న జరగాల్సిన