‘ఇండియ‌న్ 2’ షూటింగ్ బాధిత కుటుంబాల‌కు ఆర్థిక సాయం అంద‌వేత‌

  • IndiaGlitz, [Friday,August 07 2020]

క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం 'ఇండియ‌న్ 2'. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యం జరుగుతున్నప్పుడు ఫిబ్రవరిలో అప‌శృతి చోటు చేసుకుంది. సెట్స్‌లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. చెన్నై సిటీకి దూరంగా ఉండే ఈవీపీ స్టూడియోలో సినిమా కోసం లైటింగ్ వేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ సెట్‌లో ఉన్న క్రేన్ తెగిప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు చ‌నిపోయారు. ప‌ది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అప్పుడు ఆగిపోయిన షూటింగ్ ఇంకా మొద‌లు కాలేదు. మ‌ధ్య‌లో మొద‌లు పెట్టాల‌నుకున్నా.. క‌రోనా ఎఫెక్ట్ మొద‌లు కావ‌డంతో షూటింగ్ ప్లాన్స్ ఆగిపోయాయి.

ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు చనిపోయిన వారి కుటుంబాల‌కు క‌మ‌ల్ హాస‌న్ కోటి రూపాయ‌లు, డైరెక్ట‌ర్ శంక‌ర్ శంక‌ర్ కోటి రూపాయ‌లు, నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ రెండు కోట్ల రూపాయ‌లు ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు వారి కుటుంబాల‌కు ఈ సాయాన్ని అంద‌జేశారు. ఓ మీటింగ్‌ను ఏర్పాటు చేసిన బాధిత కుటుంబాల్లోని వ్య‌క్తుల‌ను క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్‌, స‌హా లైకా ప్ర‌తినిధులు క‌లిసి వారికి ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక‌పై త‌న సినిమాల్లో ఇలాంటి ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటాన‌ని శంక‌ర్ చెబుతూ శంక‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యారు.

More News

‘కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2’ రెగ్యుల‌ర్ షూటింగ్ ఎప్ప‌టి నుండంటే..?

సినిమా చరిత్రలో హిట్స్‌, సూపర్‌హిట్స్‌, బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు వస్తుంటాయి. కానీ ట్రె్‌ండ సెట్టింగ్‌ మూవీస్‌ మాత్రం అరుదుగానే వస్తుంటాయి.

టిక్‌టాక్‌పై కొరడా ఝుళిపించిన ట్రంప్..

చైనా యాప్‌లపై అమెరికా సైతం కొరడా ఝుళిపించింది. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌ డ్యాన్స్‌తో లావాదేవీలను నిలిపి వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్

‘మై బాయ్ ఫ్రెండ్స్‌ గర్ల్ ఫ్రెండ్స్‌’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన ప్రభాస్

‘మై బాయ్ ఫ్రెండ్స్‌ గర్ల్ ఫ్రెండ్స్‌’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేశాడు.

అభిమానులకు కానుక సిద్ధం చేస్తున్న నాగ్!!

ఈ ఆగ‌స్ట్ 29న కింగ్ నాగార్జున పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా నాగార్జున లేటెస్ట్ మూవీ ‘వైల్డ్ డాగ్‌’ నుండి టీజ‌ర్‌ను విడుద‌ల

పవన్‌తో సోము వీర్రాజు భేటీ.. కీలక విషయాలపై చర్చ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు.