భీమ్లా నాయక్ రిలీజ్ నాడు జంతు బలి... పవన్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు

  • IndiaGlitz, [Monday,March 07 2022]

భారత్‌లో సినీతారలకు వున్న క్రేజ్ సాధారణమైంది కాదు. వారిని దైవంలా ఆరాధిస్తారు అభిమానులు. వాళ్ల ఒంటిపై ఈగ వాలనివ్వరు. ఎవరైనా తమ అభిమాన హీరోని పల్లెత్తు మాటంటే అస్సలు ఊరుకోరు. ఇక వాళ్ల పుట్టినరోజులు, సినిమా విడుదల సందర్భాల్లో జాతర మామూలుగా వుండదు. అన్నదానం, రక్తదానం, సహాయక కార్యక్రమాలు చేస్తూ వుంటారు. అయితే అభిమానుల అత్యుత్సాహం ఒక్కోసారి తారలను చిక్కుల్లో పడేస్తుంది. తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులపై కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళితే.. పవన్, రానాలు నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎప్పటిలాగే థియేటర్ల వద్ద పవర్‌స్టార్ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. కటౌట్లు, బ్యానర్లు, పాలాభిషేకాలు, బాణాసంచా కాల్పులు చోటు చేసుకున్నాయి. అయితే చిత్తూరు జిల్లాలో మాత్రం కొందరు అభిమానులు రోటీన్‌కు భిన్నంగా వ్యవహరించారు.

భీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా కొందరు వ్యక్తులు మేకను బలిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో అషర్ అనే న్యాయవాది దీనిపై చిత్తూరు జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో, పవర్ స్టార్ అభిమానులపై ఆంధ్రప్రదేశ్ జంతువులు, పక్షుల బలి నిరోధక చట్టం-1950లోని సెక్షన్-6 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాదు, ఐపీసీ 34, 429, ఆయుధాల చట్టం సెక్షన్ 25(1)(A), పీసీఏ 11(1)(a) కూడా నిందితులపై మోపారు.

ఇకపోతే.. ఈ సినిమాలో పవర్‌స్టార్ ‘భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్‌గా దీనిని తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందించారు. పవన్‌కు జోడీగా నిత్యామీనన్‌, రానాకు జంటగా సంయుక్త మీనన్ నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ‘‘భీమ్లా నాయక్’’ను నిర్మిస్తుండగా.. సాగర్ చంద్ర దర్శకత్వం వహించారు.

More News

నాగశౌర్య 'కృష్ణ వ్రింద విహారి' రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే..?

హిట్టు, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు యంగ్ హీరో నాగశౌర్య. కొత్తదనం నిండిన కథలతో యువతను, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారాయన.

రామ్‌చరణ్‌కు 'బాహుబలి' కాజాతో సన్మానం.. డైరెక్టర్‌ శంకర్‌కు కూడా, ఫొటోలు వైరల్

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగియడం, విడుదలకు సిద్ధమవ్వడంతో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తన మిగిలిన ప్రాజెక్ట్స్‌పై దృష్టి సారించారు.

చిక్కుల్లో సోనాక్షీ సిన్హా: చీటింగ్ కేసు, నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్‌ జారీ

బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సోనాక్షీ సిన్హా తొలుత వరుస విజయాలతో మంచి ఊపు మీద కనిపించింది.

క్రికెట్ లవర్స్‌కి గుడ్‌న్యూస్.. ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసిందోచ్, సన్‌రైజర్స్ ఫస్ట్ మ్యాచ్ ఆ జట్టుతోనే?

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) ఆదివారం ప్రకటించింది. మార్చి 26వ తేదీ నుంచి మే 29వ తేదీ వరకు...

షేన్‌వార్న్ మరణంపై కొత్త అనుమానాలు.. హోటల్ గదిలో, టవల్స్‌పై రక్తపు మరకలు

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ మరణంతో క్రికెట్ ప్రేమికులు షాక్‌కు గురయ్యారు. ఆయన లేరనే వార్తతో క్రికెట్ ప్రపంచం మూగబోయింది. తన స్పిన్ మాయాజాలంతో జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించి..