సికింద్రాబాద్ క్లబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. భారీ ఆస్తినష్టం, బ్రిటీష్ వారి హయాంలో నిర్మాణం

  • IndiaGlitz, [Sunday,January 16 2022]

సంక్రాంతి పండుగ వేళ సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. సికింద్రాబాద్‌ క్లబ్‌లో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో క్లబ్‌ పూర్తిగా దగ్ధమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 10 ఫైరింజిన్ల సాయంతో దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

దీనితో పాటు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం కారణంగా దాదాపు రూ.20 కోట్ల మేర ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. సంక్రాంతి సెలవుదినం కావడంతో శనివారం క్లబ్‌ తెరవకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. క్లబ్‌లో అగ్నిప్రమాదానికి దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

భారతదేశాన్ని బ్రిటీష్ వారు పరిపాలిస్తున్న సమయంలో ఆర్మీ అధికారుల కోసం 1878లో సికింద్రాబాద్ క్లబ్‌ను నిర్మించారు. దాదాపు 20 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పారు. ఈ క్లబ్‌ను కేంద్ర ప్రభుత్వం భారతీయ వారసత్వ సంపదగా గుర్తించి 2017లో పోస్టల్‌ కవర్‌ కూడా విడుదల చేశారు. ఈ క్లబ్‌లో దాదాపు 300 మంది సిబ్బంది పని చేస్తుండగా.... ఇందులో 5వేల మందికిపైగా సభ్యత్వం ఉంది.

More News

అన్ని ఏరియాల్లో 'హీరో' కు సూప‌ర్ పాజిటివ్ రిపోర్ట్ వ‌చ్చింది: నిర్మాత గల్లా పద్మావతి

అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `హీరో. శ్రీ‌రామ్ ఆదిత్య ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి నిర్మించారు.

"నేను త్వరగా చనిపోవాలి, అందరికీ సంక్రాంతి విషెస్".. వర్మ వెరైటీ ట్వీట్

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేవరకు ప్రతిరోజూ ఎవరో ఒకరిని గిల్లకపోతే రామ్‌గోపాల్ వర్మకు నిద్రపట్టదు. కొందరు ఆయనకు పిచ్చి అంటారు.. ఇంకొందరు ఆయను జీనియస్ అంటారు.

రాజకీయాలకు దూరం.. పదవులకు ఆశపడే వాడిని కాదు: రాజ్యసభ ఆఫర్‌పై తేల్చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం కృష్ణా జిల్లా డోకిపర్రు వచ్చారు చిరంజీవి.

ఢిల్లీ: పూల మార్కెట్‌లో బాంబు కలకలం.. నిర్వీర్యం చేసిన పోలీసులు

రిపబ్లిక్ డే వేడుకలకు ముందు దేశ రాజధాని ఢిల్లీలో బాంబు కలకలం రేపింది. ఢిల్లీలోని ఘాజీపూర్ పూల మార్కెట్‌లో శుక్రవారం ఓ అనుమానాస్పద బ్యాగ్‌ వున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

డాక్టర్ దాసరి "దర్శకరత్న" బయోపిక్

సినీరంగంలో బహుముఖ ప్రజ్ఞాశాలిగానే కాదు అన్నింటా తానై, అందరివాడుగా వెలుగొందిన దివంగత దర్శకరత్న దాసరి నారాయణరావు గురించి ఎంత చెప్పినా తక్కువే.