Telangana New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదం.. ఉలిక్కిపడ్డ ప్రభుత్వ వర్గాలు

  • IndiaGlitz, [Friday,February 03 2023]

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగి.. పై అంతస్తులోని గుమ్మటంపై దట్టంగా మంటలు కమ్ముకున్నాయి. సమచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది 11 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని అనుకుంటున్న వేళ.. ఈ ప్రమాదం జరగడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టిన సంగతి తెలిసిందే.

6 వందల కోట్లకు పైగా వ్యయంతో కొత్త సచివాలయం:

కాగా... హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్‌ పక్కనే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం .. ఆధునిక హంగులతో కొత్త సచివాలయ నిర్మాణానికి నడుం బిగించింది. దాదాపు 6 వందల కోట్లకు పైగా వ్యయంతో, 6 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, అధికారుల కోసం అధునాతన హాల్స్‌ను నిర్మిస్తున్నారు. అలాగే మంత్రుల షేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీస్‌లు ఏర్పాటు చేయనున్నారు.

దక్కన్, కాకతీయ నిర్మాణ శైలిలో సచివాలయ నిర్మాణం:

కొత్త సచివాలయ నిర్మాణానికి డిజైన్లను వాస్తు ప్రకారం రూపొందించారు. దక్కన్, కాకతీయ నిర్మాణ శైలిలో ఈ డిజైన్లు వున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణాలు వుండనున్నాయి. సచివాలయంలోకి గాలి , వెలుతురు ధారాళంగా వచ్చేలా ప్లాన్ చేశారు. భవనం మధ్యలో భారీ ఎల్ఈడీ వాల్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తెలంగాణ అభివృద్ధిని , 33 జిల్లాల కళ, సంస్కృతిని ప్రదర్శిస్తారు. ఒకేసారి 650 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్ సౌకర్యాలతో పాటు సిబ్బంది, సందర్శకుల కోసం బ్యాంక్, ఏటీఎం, డిస్పెన్సరీ, క్యాంటీన్, ఫైర్ స్టేషన్, విజిటర్స్ రూమ్స్‌ వుంటాయి.

More News

K Viswanath: అందుకే ఆయన కళాతపస్వి : చివరి శ్వాస వరకు కళామతల్లి సేవలోనే.. పాట రాస్తూ మృత్యు ఒడిలోకి

తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త నడకను నేర్పి, ఎన్నో అపురూప చిత్రాలను అందించిన కళాతపస్వి కే విశ్వనాథ్ మరణంతో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే.

K Viswanath : దివికేగిన కళాతపస్వి.. కే. విశ్వనాథ్ కన్నుమూత, శోకసంద్రంలో టాలీవుడ్

జమున, సాగర్‌ మరణాల నుంచి కోలుకోకముందే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ దర్శకుడు,

Rangamarthanda:'రంగమార్తాండ' నుండి బ్రహ్మానందం గ్లిమ్స్ విడుదల!!!

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం పుట్టిన రోజు సందర్బంగా 'రంగమార్తాండ' నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్.

Vedha :ఫిబ్రవరి 9న 'వేద' రిలీజ్

కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్  నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి మాట్లాడుతూ...

Telusa Manasa: ‘తెలుసా..మనసా..’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు

కేరింత ఫేమ్ పార్వతీశం హీరోగా జశ్విక హీరోయిన్‌గా శ్రీబాలాజీ పిక్చర్స్, బ్యాన‌ర్‌పై వైభ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో