Shanthi Swaroop: తొలి తరం తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూత

  • IndiaGlitz, [Friday,April 05 2024]

తెలుగు మీడియా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తొలి తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని మీడియా, రాజకీయ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు. దూరదర్శన్‌లో వార్తలు చదివిన మొట్టమొదటి యాంకర్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఆయన వార్తలు చెబుతుంటే ప్రజలు ఎంతో చక్కగా ఆలకించేవారు. అంతలా ప్రతి ఒక్కరి ఇంట్లో కుటుంబసభ్యుడిలా అయిపోయారు.

1977, అక్టోబరు 23న నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి తెలుగు దూరదర్శన్ కార్యక్రమాలను ప్రారంభించారు. సోమాజిగూడలోని దూరదర్శన్ స్టూడియో నుంచే శాంతి స్వరూప్ వార్తలు చదివేవారు. 1978లో దూరదర్శన్‌లో ఉద్యోగిగా చేరారు. అయితే 1983 నవంబరు 14న తెలుగు వార్తా విభాగం ప్రారంభమైంది. సాయంత్రం 7 గంటలకు ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. అందులో మొదటి వార్తగా బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ టీ రామారావు ప్రారంభించారు అని చదివారు.

అప్పటి నుంచి మొదలైన ఆయన ప్రస్తానం 2011 వరకు కొనసాగింది. ఇప్పటిలా టెలీ ప్రాంప్టర్లు లేకుండానే ఆయన వార్తలు చదివేవారు. బులిటెన్ మొదలు కాక ముందే వార్తలన్నింటిని ముందుగానే చదువుకునేవారు. అనంతరం చకచకా అందరికీ అర్థమయ్యేలా వార్తలు చెప్పేవారు. ఇప్పటి యాంకర్లు ఎందరికో ఆయన గురువుగా ఉన్నారు. ఓసారి బాగా గుర్తుండిపోయిన విషాదకరమైన వార్త..? సంతోషకరమైన వార్త..? ఏది అని ప్రశ్నించగా.. రెండు కూడా విషాద వార్తలే అని చెప్పారు.

మొదటిది దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణం గురించి చెబుతూ చాలా బాధపడ్డాను అని.. రెండో వార్త ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ మరణ వార్త అని చెప్పుకొచ్చారు. ఇందిరా గాంధీ మరణం కంటే రాజీవ్ గాంధీ గారి మరణం చాలా దారుణమని.. ఆయన శరీరం ముక్కలు ముక్కలూ అయిందని అందుకే ఆ వార్త ఇప్పటికీ నాకు గుర్తుండి పోయిందని తెలిపారు. అలా తన ప్రస్థానంలో ఎన్నో విషాదకర.. సంతోషకరమైన వార్తలు ఆయన చదివి ప్రజలకు చేరువయ్యారు.

More News

మళ్లీ అధికారంలోకి రాగానే తొలి సంతకం దాని మీదే.. సీఎం జగన్ హామీ..

టీడీపీ అధినేత చంద్రబాబు దుర్మార్గం వల్లే రెండు రోజుల్లో 31 మంది అవ్వాతాతలు చనిపోయారని సీఎం జగన్ ఆరోపించారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో

అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా..

ఎన్నికల వేళ అధికార వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పార్టీకి రాజీనామా చేశారు.

Kavitha: లిక్కర్ స్కాంలో కవిత బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్

లిక్కర్ స్కాంలో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్న ఆమె మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని

ఏపీలో బదిలీ అధికారుల స్థానంలో ఈసీ కొత్త నియామకాలు

ఎన్నికల్లో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో కొందరు జిల్లా ఎస్పీలు, కలెక్టర్లపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

Buddha Prasad: అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్.. రైల్వేకోడూరు అభ్యర్థి మార్పు..

అవనిగడ్డ జనసేన అభ్యర్థిగా సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ పేరు ఖరారుతో పాటు రైల్వేకోడూరు అభ్యర్థిని మారుస్తూ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.