`బ్లాక్డ్` మూవీ ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

  • IndiaGlitz, [Thursday,October 15 2020]

మ‌నోజి నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్‌ఫ్రా టాకీస్ ప‌తాకంపై రామ్ లొడ‌గ‌ల ద‌ర్శ‌కత్వంలో ప‌ద్మలెంక నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్ల‌ర్ 'బ్లాక్డ్‌'. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుని విడుద‌ల‌కి సిద్దంగా ఉంది. 'బ్లాక్డ్'మూవీ ఫ‌స్ట్‌లుక్ టైటిల్‌లోగోని ఈ రోజు విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.. ఈ సంద‌ర్భంగా,,

ద‌ర్శ‌కుడు రామ్ లొడ‌గ‌ల మాట్లాడుతూ - ''బ్లాక్డ్ మూవీ ఫ‌స్ట్‌లుక్ టైటిల్‌లోగోని రిలీజ్ చేయ‌డం హ్యాపీగా ఉంది. థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే హార‌ర్ కామెడీ జోన‌ర్‌లో అంద‌రినీ ఆక‌ట్టుకునే విధంగా ఈ మూవీ తెర‌కెక్కింది.  ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. విడుద‌ల‌కి సిద్ధంగా ఉంది. ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ స‌హ‌కారంతో మూవీ ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. అలాగే మా నిర్మాత ప‌ద్మలెంక గారు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాని రిచ్ లోకేష‌న్స్‌లో తెర‌కెక్కించ‌డానికి తోడ్ప‌డ్డారు. బ్లాక్డ్ మూవీ  ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌వ‌నుంది. అన్ని పాట‌లు త‌ప్ప‌కుండా మిమ్మ‌ల్ని అల‌రిస్తాయి. త్వ‌ర‌లోనే టీజ‌ర్, పాట‌ల‌ని విడుద‌ల‌చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.

మ‌నోజి నందం, శ్వేత సాలూరు, శేకింగ్ శేషు, FM బాబాయ్‌, TNR, స‌త్య శ్రీ‌, మెహ‌బూబ్ భాష‌, విన‌య్ మ‌హ‌దేవ్‌, రామారావు లెంక‌, శ్రీ‌నివాస‌రాజు, గుండు ముర‌ళి, దివ్య‌, ప‌ద్మావ‌తి, శ్రీ‌వ‌ల్లి సాలూరు, ల‌క్ష్మ‌న్ సాలూరు త‌దిత‌రులు

More News

ప్రముఖ సినీ నటుడు సచిన్ జోషి అరెస్ట్..

ప్రముఖ సినీ నటుడు సచిన్ జోషిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుట్కా అక్రమ రవాణా ఆరోపణలు రావడంతో హైదరాబాద్ పోలీసులు..

మెట్రో స్టేషన్ వద్ద కుంగిపోయిన రోడ్డు.. స్పందించిన మెట్రో రైల్‌ ఎండీ

హైదరాబాద్‌లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లాక్‌డౌన్ సమయంలో వేసిన రోడ్లన్నీ ప్రస్తుతం దారుణంగా దెబ్బ తిన్నాయి.

జగన్‌ను సీఎం పదవి నుంచి తొలగించండి: సుప్రీంలో పిటిషన్

ఏపీ సీఎం జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు రాసిన లేఖ పెను దుమారాన్నే రేపుతోంది. దీనిపై సీఎం పదవి నుంచి జగన్‌ను తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు అయింది.

హీరోయిన్‌తో బోండా ఉమ అంటూ పిక్స్.. పోలీసులకు ఫిర్యాదు

తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడు ఎలా దొరుకుతారా? అని అధికార పక్షం నేతలు ఎదురు చూస్తూ ఉంటారు.

ఒకే కుటుంబానికి చెందిన 9 మంది గల్లంతు..

వర్షాలు బీభత్సానికి హైదరాబాద్ సహా చుట్టు పక్కల జిల్లాల్లో ఆస్తి నష్టంతో పాటు... ప్రాణ నష్టం కూడా సంభవిస్తోంది.